యాంక‌ర్ ప్ర‌దీప్‌కు ఈ క‌ళ‌లు కూడా ఉన్నాయా..??

-

యాంకర్ ప్రదీప్.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌డం అవ‌స‌రంలేని పేరు. తెలుగు బుల్లితెర‌పై వచ్చే ఎన్నో షోలలో కనిపిస్తూ తనదైన రీతిలో అందరిని ఆక‌ట్టుకుంటూ, ప్రేక్షకులకు వినోదాన్ని కల్పించే యాంకర్లలో ఈయ‌న ఒక‌రు. ప్ర‌స్తుతం యాంక‌ర్ ప్ర‌దీప్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దీనికి కారణం అతడిలో ఉన్న టాలెంట్‌తో పాటు అనర్గళంగా మాట్లాడ గల నైపుణ్యమే. ఇక బుల్లితెర‌పై స్టార్ యాంక‌ర్‌గా ఉన్న ప్ర‌దీప్ హీరోగా మార‌బోతున్న సంగ‌తి తెలిసిందే. సుకుమార్ ద‌గ్గ‌ర కొన్ని సినిమాల‌కు దర్శకత్వ శాఖలో పని చేసిన‌ మున్నా అనే కొత్త కుర్రాడు ప్ర‌దీప్‌ సినిమాను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

ఈ చిత్రానికి ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అని ఫిక్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. 1947లో జరిగే పీరియాడిక‌ల్ క‌థ ఇది. రొటీన్ క‌థ‌ల‌తో కాకుండా కాస్త కొత్త‌గా ప్రేక్ష‌కుల ముందుకు రావాల‌ని చూస్తున్నాడు ప్ర‌దీప్. అమృత అయ్యర్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే ప్రమోషన్ కూడా ఓ రేంజ్‌లో చేస్తున్నాడు ప్ర‌దీప్‌. ఇప్ప‌టికే సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో నీలినీలి ఆకాశం సాంగ్ విడుద‌ల చేయించ‌గా.. ఆ సాంగ్ సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది. అలాగే తాజాగా కాజల్ అగ‌ర్వాల్‌తో `మీకో దండం` సాంగ్‌ను విడుద‌ల చేయించాడు ప్ర‌దీప్‌.

ఈ సాంగ్‌లో ప్రదీప్ డాన్సులు కూడా దుమ్ము దులిపేశాడు. ఈ పాటను శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసాడు. ప్రదీప్‌కు ఈ క‌ళ‌లు కూడా ఉన్నాయా అన్నంత‌గా.. ఈ సాంగ్‌లో త‌న డాన్స్‌తో ఓ రేంజ్‌లో అద‌ర‌గొట్టాడు. ఇక ఏదేమైనా.. తన సినిమా ప్ర‌మోష‌న్స్‌ కోసం స్టార్స్‌ను బాగానే వాడేసుకుంటున్నాడు యాంకర్ ప్రదీప్. కాగా, ఎస్వీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎస్వీ బాబు నిర్మించిన ఈ చిత్రాన్ని కేవ‌లం కోటిన్నర బ‌డ్జెట్‌తో మొద‌లు పెడితే.. ఆ త‌ర్వాత‌ దాదాపు 3.8 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు అయిన‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఈ సినిమా తో ప్ర‌దీప్ ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news