షాకింగ్ : లో దుస్తుల్లో మూడు కేజీల బంగారం..

లక్నో అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టి వేశారు కస్టమ్స్ అధికారులు. ఓ లేడి కిలాడి తో పాటు మరో స్మగ్లర్ వద్ద కోటిన్నర విలువ చేసే విదేశీ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. దుబాయ్ నుండి వేరు వేరు విమానాల్లో లక్నో వచ్చి ఇద్దరు స్మగ్లర్ల వద్ద దాదాపు 3 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. పురుషులకు దీటుగా లేడీ కిలాడీ అక్రమ బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు.

బంగారాన్ని కరిగించి పేస్టుగా మార్చి లోదుస్తుల్లో దాచి    లక్నో ఎయిర్‌పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పి గ్రీన్ ఛానెల్ ద్వారా బయటకు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే గ్రీన్ ఛానెల్ ద్వారా వెళుతున్న ఇద్దరిని అడ్డగించి అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు తనదైన స్టైల్ లో విచారణ చేయగా లోదుస్తుల్లో దాచి అక్రమ బంగారం రవాణా బయట పడింది. లేడి కిలాడి వద్ద 2314 కేజీల బంగారం మరో స్మగ్లర్ వద్ద 544 గ్రాముల బంగారం సీజ్ చేసిన అధికారుల బృందం ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.