లోదుస్తులలో బంగారం.. శంషాబాద్ లో 1.4 కిలోల బంగారం సీజ్ !

-

ఇది వరకు బంగారం స్మగ్లింగ్ అంటే ఒక దేశం నుండి మరో దేశానికి మధ్య ఉండేది. కానీ ఇప్పుడు దేశంలో ఒకచోట నుండో ఒక చోటకు కూడా విమానాల ద్వారా స్మగుల్ చేస్తున్నారు కేటు గాళ్ళు. మరి వేరే దేశాల నుండి అయితే కస్టమ్స్ చార్జ్ లు ఎగ్గోట్టడానికి అనుకోవచ్చు. మరి ఇక్కడ లోకల్ లో ఎందుకు చేస్తున్నారో వారికే తెలియాలి. వివరాల్లోకి వెళ్తే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ ఆదికారులు తనిఖీ చేసి అక్రమ బంగారం పట్టి వేశారు.

వైజాగ్ నుండి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుండి 1.4 కేజీల బంగారం సీజ్ చేశారు కస్టమ్స్ ఆదికారులు. ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ ఆదికారులు వారి వద్దనున్న 1.4 కిలోల బంగారం సీజ్ చేసి విచారణ చెపట్టారు. నిందితులు బంగారాన్ని లోదుస్తులలో అమర్చుకుని వస్తుండగా గుర్తించిన ఆధికారులు వారిని స్కాన్ చేసి పట్టేశారు. నిందితులు నడిచే విధానంలో తేడా రావడంతో అనుమానం వచ్చిన అధికారులు వారిని పట్టేశారు. ఇక పట్టుబడిన బంగారం విలువ 70 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news