ఆర్ ఆర్ ఆర్ గోల్డెన్ గ్లోబ్ కొడితే నెక్స్ట్ ఆస్కారే..!!

-

రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ లు ఆర్ ఆర్ ఆర్ సినిమా తో పాన్ ఇండియా స్టార్స్ గా మారిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాజమౌళి ఈ సినిమా ను ప్రపంచ స్థాయిలో ప్రమోట్ చేస్తూ మరింత పేరు తీసుకొని వచ్చేలా చేస్తున్నాడు. దానితో రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ లు హలీవుడ్ ప్రేక్షకులకు ఇపరీతంగా నచ్చుతున్నారు. అలాగే ఈ సినిమా గోల్డెన్ గ్లోబ్ అవార్డు రేసులో ముందుకు వెళుతూనే ఉంది.

లాస్ ఏంజెల్స్ లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుక ఈ రోజు ఘనంగా జరగనుంది. ఈ ఇంటర్నేషనల్ సినిమా వేడుకలో ఆర్ ఆర్ ఆర్ టీమ్ తరుపున రాజ మౌళి, రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ పాల్గొననున్నారు.గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో రెండు విభాగాలలో ఆర్ ఆర్ ఆర్ మూవీ నామినేషన్స్ ని సాధించింది. బెస్ట్ మోషన్ పిక్చర్ ఆఫ్ పారిన్ మూవీస్ కేటగిరిలో ఆర్ ఆర్ ఆర్ మూవీ పోటీపడనుంది. అంతే కాకుండా బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలోనూ ‘నాటు నాటు’ సాంగ్ కి గానూ ఆర్ ఆర్ ఆర్ మూవీ పోటీ లో ఉంది.

ఈ రెండు విభాగాల్లో RRR కు ఖచ్చితంగా ఏదో ఒక అవార్డు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విషయంలో అభిమానులు గట్టి నమ్మకంతో వున్నారు. ఒక వేళ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ సాధించి నట్లయితే అది ఆస్కార్ అవార్డు రేసులో ముందుకు వెళుతుందని చెబుతున్నారు. అందుకే అమెరికాలో ఉన్న జూ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ అభిమానులు హంగామా చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news