మహిళలకు సువర్ణ అవకాశం… ఈ బ్యాంకు లో అకౌంట్ ఓపెన్ చేస్తే రూ.5 లక్షల వరకు ప్రయోజనం..!

-

దేశంలో మహిళల కోసం ఎన్నో రకాల స్కీమ్ ను ప్రభుత్వాలు అందుబాటులోకి తీసుకుని వచ్చాయి. అయితే ఇప్పుడు దేశంలోనే రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB) తాజాగా కస్టమర్లకు శుభవార్త అందించింది. ఇది కేవలం మహిళలకు మాత్రమే. వీరి కోసం ప్రత్యేకమైన అకౌంట్ సేవలు ఆవిష్కరించింది. ఈ అకౌంట్ తెరిచి మహిళలు చాలా రకాల ఉపయోగాలు పొందొచ్చు. ఈ అకౌంట్ ఓపెన్ చేయడం వల్ల సుమారు ఆరు రకాల సర్వీసులు ఉచితంగా పొందవచ్చు. అలాగే రూ.5 లక్షల వరకు బెనిఫిట్ పొందవచ్చు. అంటే అకౌంట్ కలిగిన వారికి రూ.5 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా లభిస్తుంది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ ట్విట్టర్ వేదికగా ఈ కొత్త సర్వీసులను ప్రకటించింది. మహిళల కోసం ‘పీఎన్‌బీ పవర్ సేవింగ్స్’ అనే ప్రత్యేకమైన స్కీమ్ ప్రవేశపెట్టింది. ఇది మహిళలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ అకౌంట్ ను జాయింట్ గా కూడా తీసుకోవచ్చు. కానీ, తొలి పేరు మాత్రం మహిళలదే అయ్యి ఉండాలని పీఎన్‌బీ ట్వీట్ చేసింది. ఈ ఖాతా తెరవడానికి గ్రామాల్లో ఉండే మహిళలు రూ.500 చెల్లించాలి. అదే చిన్న పట్టణాల్లో ఉండే మహిళలు అయితే రూ.1,000 చెల్లించాలి.

ఇక పెద్ద పట్టణాలు, ఇతర నగరాల్లో నివాసం ఉండే వారు రూ.2,000 చెల్లించి ఈ ఖాతా ఓపెన్ చేయొచ్చు. ఖాతా తెరిచిన మహిళలకు 50 పేజీల చెక్ బుక్ కూడా ఉచితంగా అందిస్తారు. నెఫ్ట్ మనీ ట్రాన్స్‌ఫర్ సర్వీసులు ఫ్రీగానే లభిస్తాయి. బ్యాంక్ నుంచి ప్లాటినం డెబిట్ కార్డు ఉచితంగా వస్తుంది. అలాగే మెసేజ్ కి కూడా ఎలాంటి ఛార్జ్ ఉండదు. రోజుకు అకౌంట్ నుంచి రూ. 50,000 వరకు విత్‌ డ్రా చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news