కరోనా వైరస్ వ్యాక్సిన్ విషయంలో చైనా విజయం అయిందా…? అవుననే సమాధానం వినపడుతుంది. సిఎన్‌బిజి తయారు చేస్తున్న వ్యాక్సిన్ మంచి ఫలితాలను ఇచ్చింది అని, వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా ఏ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడటం లేదు అని అధికారులు పేర్కొన్నారు. గ్లోబల్ కరోనా వ్యాక్సిన్ రేసులో చైనా, రష్యా ముందు వరుసలో ఉన్నాయి.
చైనా వ్యాక్సిన్ మంచి రోగ నిరోధక శక్తి పెంచింది అని పేర్కొన్నారు. చైనా నేషనల్ బయోటెక్ గ్రూప్ (సిఎన్‌బిజి) అనుబంధ సంస్థ బీజింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ ప్రొడక్ట్స్ చేత బిబిఐబిపి-కార్వి అనే వ్యాక్సిన్ ని అభివృద్ధి చేస్తున్నారు. మూడవ దశ క్లినికల్ ట్రయల్స్‌లో ప్రవేశించిన ప్రపంచంలోని టాప్ 10 కరోనావైరస్ వ్యాక్సిన్ ప్రాజెక్టులలో ఇది కూడా ఒకటి. ఈ వ్యాక్సిన్ రెండు నెలల్లో అందుబాటులోకి రావొచ్చు అని అంచనా వేస్తున్నారు.