బిజినెస్ ఐడియా: కేవలం రూ.5 వేల పెట్టుబడితో మంచి వ్యాపారం.. నెలకు రూ.60 వేలు ఆదాయం..

-

బిజినెస్ చేసి మంచి లాభాలను పొందాలని చాలా మంది అనుకుంటారు. అయితే ఎటువంటి బిజినెస్ మొదలు పెడితే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందాలని భావిస్తున్న వారికి చక్కటి బిజినెస్ ఐడియా ఉంది..ఆన్లైన్లో టిఫిన్ ను అమ్మడం..ప్రస్తుతం అన్ని ఆన్లైన్ మయం అయిపోయింది..అన్ని రకాల వస్తువులను ఆన్లైన్లోనే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా నిత్యావసరాలు, పండ్లు తదితర పదార్థాలను ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తున్నారు. కరోనా కంటే ముందే ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసే విధానం మన దగ్గర కూడా అందుబాటులోకి వచ్చాయి..

జొమాటో, స్విగ్గీ లాంటి సంస్థలు ఆన్లైన్ ఫుడ్ వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కించాయి. అయితే.. ఆన్లైన్లో టిఫిన్ కు మాత్రం ఆశించినంతగా ఆర్డర్లు ఉండడం లేదు. ఇందుకు కారణంగా.. వాస్తవంగా టిఫిన్ ధర తక్కువుగా ఉంటుంది..ఆర్డర్ చేస్తే సర్వీస్ ఛార్జితె కలిపి మొత్తం ధర అధికమవుతుంది. ఈ నేపథ్యంలో సామాన్యులు టిఫిన్ ను ఆన్లైన్లో ఆర్డర్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో మీరు కూడా కొత్తగా బిజినెస్ ప్రారంభించాలని భావిస్తే ఆన్లైన్ టిఫిన్ వ్యాపారాన్ని ప్రారంభించడం బెస్ట్..

మీరు ఇంటి నుంచే ప్రారంభించవచ్చు. కేవలం రూ. 5 నుంచి రూ. 10 వేల పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. కాకపోతే ఈ బిజినెస్ కు మీ స్థానికంగా పబ్లిసిటీ చేయడం అవసరం. సోషల్ మీడియాలో పబ్లిసిటీ బాగా చెయ్యాలి.. అప్పుడే అందరికి తెలిసి ఆర్డర్లు ఎక్కువగా వస్తాయి. అయితే, మీరు మంచి వంట మాస్టర్ ను మాత్రం నియమించుకోవాల్సి ఉంటుంది. మీకు టూ వీలర్ ఉంటే.. మీరు డెలివరీలు చేయొచ్చు. ఆర్డర్లు పెరుగుతున్నా కొద్దీ.. డెలివరీ చేయడానికి బాయ్స్ ను నియమించుకోవచ్చు..

మంచి క్వాలిటీ తో పాటు, రుచికరమైన టిఫిన్స్ చేస్తే వ్యాపారం పుంజుకుంటుంది.కేవలం టిఫిన్ మాత్రమే కాదు..ఈవెంగ్ స్నాక్స్ కూడా పెడితే మరింతగా లాభాలను అందుకోవచ్చు.బాగా క్లిక్ అయితే.. రోజుకు రూ.2 వేలు, నెలకు రూ.60 వేల వరకు సంపాధించే అవకాశం ఉంటుంది..మహిళలు కూడా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు..మీకు ఇలాంటి ఆలోచన వుంటే ఇప్పుడే మొదలు పెట్టండి.. ఆల్ ది బెస్ట్..

Read more RELATED
Recommended to you

Latest news