గుడ్ న్యూస్.. ఇంటర్ అర్హతతో ఎయిర్‌పోర్ట్‌లో 1086 ఉద్యోగాలు..

-

ఇంటర్ పాస్ అయ్యారా? ఉద్యోగాల కోసం వెతుకుతున్నారా? మీకో గుడ్ న్యూస్.. ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాలు.. ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌లో వివిధ గ్రౌండ్ డిపార్ట్‌మెంట్లలో మొత్తం 1086 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.igiaviationdelhi.com ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 12 నుంచి ప్రారంభమైంది. ఈ గడువు జూన్ 21తో ముగుస్తుంది. రిక్రూట్‌మెంట్ అర్హత ప్రమాణాలు, సెలక్షన్ ప్రాసెస్ పూర్తి వివరాలు తెలుసుకుందాం…

ప్రస్తుతం 12వ తరగతి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు… అయితే, రిక్రూట్‌మెంట్‌కు అప్లై చేసుకోవాలంటే అభ్యర్థుల వయసు 2023 జనవరి 1 నాటికి కనీస వయసు 18 ఏళ్లు, గరిష్ట వయసు 30 ఏళ్లకు మించకూడదు. అయితే ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వయసు సడలింపు నిబంధనలు ఉన్నాయి.

దరఖాస్తు సమయంలో వయసుకు సంబంధించిన సర్టిఫికేట్‌ను తప్పనిసరిగా సమర్పించాలి. ఎయిర్‌లైన్, గ్రౌండ్ హ్యాండ్లింగ్, హాస్పిటాలిటీ, రిటైల్ అవుట్‌లెట్స్, ఫుడ్ కోర్టులు, కార్గో ఇండస్ట్రీలో ఉపాధి పొందాలనేకునేవారు ఈ రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.. ఇక ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యే అభ్యర్థులకు నెలకు రూ.25000 నుంచి 35,000 వరకు జీతం లభిస్తుంది.. ఇక ఆలస్యం ఎందుకు ఆసక్తి కలిగిన విద్యార్థులు వెంటనే అప్లై చేసుకోండి..

Read more RELATED
Recommended to you

Latest news