విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి నాలుగో శనివారం నో బ్యాగ్‌ డే

-

2023-24 పాఠశాల విద్యా సంవత్సరం షెడ్యూల్​ను తెలంగాణ విద్యాశాఖ ఖరారు చేసింది. జూన్ 12 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమై.. ఏప్రిల్ 24 చివరి పనిదినంగా ప్రకటించింది. ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 11 తేదీ వరకూ వేసవి సెలవులు కాగా.. 2023-24 ఏడాదిలో  మొత్తం  229 పనిదినాలు ఉంటాయని విద్యాశాఖ ప్రకటించింది. జనవరి 10 తేదీ లోపు పదో తరగతి సిలబస్ పూర్తి చేయాల్సి ఉంటుందని విద్యాశాఖ కార్యదర్శి కరుణ వాటిక తెలిపారు.

మార్చ్​లో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. పాఠశాలల్లో ప్రతీ రోజూ విద్యార్థులకు ఐదు నిమిషాల పాటు యోగ, ధ్యానం తరగతులు ఉంటాయన్నారు. అక్టోబర్ 14 నుంచి 25 వరకు దసరా సెలవులు, జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు, డిసెంబర్‌ 22 నుంచి 26 తేదీ వరకూ క్రిస్మస్‌ సెలువులు ఉంటాయన్నారు. ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు ఏప్రిల్ 8 నుంచి 18 వరకు SA 2 పరీక్షలు ఉంటాయని విద్యా శాఖ అధికారులు తెలిపారు.

మరోవైపు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రతి నెల నాలుగో శనివారాన్ని నో బ్యాగ్‌ డే(సంచిరహిత దినం)గా పాటించనున్నారు. ఆరోజు పిల్లలు పుస్తకాల సంచి లేకుండా బడులకు రావాల్సి ఉంటుంది. ఆరోజు వారితో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలన్న దానిపై తరువాత మార్గదర్శకాలు జారీ చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news