ఆ ఆధార్ కార్డు వున్న వారికి గుడ్ న్యూస్..!

-

మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్ల లో ఆధార్‌ కార్డు లో ఒకటి. ఆధార్ వలన ఎన్నో లాభాలు వున్నాయి. స్కీమ్స్ మొదలు ఎన్నో వాటికి ఆధార్ చాలా అవసరం. బ్యాంకు అకౌంట్‌ ని ఓపెన్ చెయ్యడానికి కూడా ఆధార్ కూడా కావాలి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ కి సంబందించిన మార్పులు చేస్తూ ఉంటోంది. ఆధార్ కార్డు ని అప్డేట్ చేస్తూ ఉండాలి. పోర్టల్‌ లో కూడా చాలా మార్పులు చేస్తూ ఉంటోంది.

ఆధార్ లో మార్పులు చేసుకోవడానికి యూఐడీఏఐ అవకాశం ఇచ్చింది. అయితే అప్డేట్ చెయ్యాలంటే ముందు మీ సేవ కేంద్రాలకు, ఇతర ఆన్‌లైన్‌ సేవ కేంద్రాలకు వెళ్లాల్సి వుంది. పుట్టిన తేదీ, చిరునామా, ఫోన్‌ నెంబర్‌, ఆధార్‌లోని పేరు ఇలాంటి వివరాలని అప్డేట్ చెయ్యాల్సి వుంది. అయితే అప్డేట్ చేయడం కోసం డబ్బులు కట్టాల్సి వుంది.

గతం లో ప్రభుత్వం జారీ చేసిన ఛార్జీలు కాకుండా ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నాయి. గతం లో చార్జెస్ మీదనా కంప్లైంట్స్ ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు ఆధార్‌ అప్‌డేట్‌ కోసం వచ్చిన వినియోగదారుల నుంచి ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఓ నిర్ణయం తీసుకుంది. యూఐడీఏఐ ఈ విషయాన్ని చెప్పింది. బాల్‌ ఆధార్‌ ని అప్‌డేట్‌ చేయడం కోసం ఉచిత సర్వీసు ని అందిస్తోంది.

బాల్‌ ఆధార్‌ను పిల్లల కోసం తీసుకు వచ్చారు. బాల్ ఆధార్ కార్డు ని అప్డేట్ చేయడం కోసం ఎలాంటి డబ్బులు చెల్లించక్కర్లేదు. ఒకవేళ డబ్బులు తీసుకుంటే 1947 నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని, లేదా [email protected] ఈమెయిల్‌కు కంప్లైంట్ చేయాలనీ చెప్పింది. 5 నుంచి 15 సంవత్సరాలు నిండిన పిల్లలకు కచ్చితంగా బయోమెట్రిక్ డేటాను అప్‌డేట్ చెయ్యాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news