విద్యాశాఖపై నేడు సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. స్కూళ్లుకు వస్తున్న విద్యార్ధులపై నిరంతరం ట్రాకింగ్ ఉండాలన్నారు. పిల్లలు పాఠశాలకు రాని పక్షంలో తల్లిదండ్రులకు మెసేజ్ వెళ్తుందని.. అయినా పిల్లలు బడికి రాని పక్షంలో తల్లిదండ్రులను ఆరా తీస్తున్నామన్నారు సీఎం జగన్. పిల్లలను బడికి పంపేలా అమ్మ ఒడిని అందిస్తున్నామన్నారు. ఇంటర్ వరకూ అమ్మ ఒడి వర్తిస్తుందన్నారు.
ఆ తర్వాత కూడా విద్యాదీవెన, వసతి దీవెన ఉన్నాయన్నారు. ఇలా ప్రతి దశలోనూ చదువులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు సీఎం జగన్. డ్రాప్‌అవుట్ అనే ప్రశ్నే ఉత్పన్నం కాకుండా అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనిపై ఎప్పటికప్పుడు సమర్థవంతమైన పర్యవేక్షణ జరగాలన్నారు. వచ్చే విద్యాసంవత్సరంలో విద్యాకానుకపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు పంపిణీచేయాల్సిన పుస్తకాల ముద్రణ ముందుగానే పూర్తిచేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మే 15 నాటికి అన్నిరకాలుగా సిద్ధమవుతున్నామన్నారు అధికారులు.