ఏపీ లోని నిరుద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఎన్నో సంస్థలు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నారు.. ఇప్పుడు తాజాగా 1275 కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది.వివిధ అంశాల్లో నైపుణ్యం కలిగిన 21 వేల మందికి ఉపాధి కల్పించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంలో భాగంగా ఈ ఏడాదికి పరిశ్రమలకు అవసరమైన మానవ వనరుల అవసరాల వివరాలను పరిశ్రమల శాఖ సేకరించింది.
రాష్ట్రం లోని ప్రతి జిల్లాలకు పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్లు అక్కడి పరిశ్రమలను సంప్రదించి ఈ ఏడాదికి ఏయే నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఏ మేరకు కావాలన్న వివరాలను సేకరించారు. ఈ సర్వేలో 1,275 కంపెనీలు సుమారు 21 వేల ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారు.ఉద్యోగాలు కల్పించేందుకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలిసి ఆయా సంస్థలకు అవసరమైన అన్నీ అందించె విధంగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ వీఆర్‌వీఆర్ నాయక్ తెలిపారు.
పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కాలేజీల్లో ‘స్కిల్ హబ్స్’ ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. పరిశ్రమలకు అవసరమైన సుమారు 180కి పైగా నైపుణ్య కోర్సుల్లో శిక్షణ ఇచ్చేవిధంగా కొత్త ఆలోచనలు చెస్తున్నారు..రాష్ట్ర వ్యాప్థంగా ఉన్న 60 కంపెనిలు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాయి.మిగిలిన పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించే విధంగా స్కిల్ హబ్‌ల్లో కోర్సులను రూపొందిస్తున్నారు..
ఏపీ లోని డాక్టర్ వైఎస్సార్ హెల్త్ కేర్ ట్రస్ట్ కడప జిల్లాలో పలు పోస్టుల భర్తీకి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అందులో భాగంగా కడప జిల్లాలో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో ఆరోగ్యమిత్రలు, టీం లీడర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయస్సు, తదితర వివరాలను ఇప్పుడు చూద్దాం…
వయస్సు 42 ఏళ్లు మించకూడదు.దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ పద్ధతిలోనే ఉంటుంది. నోటిఫికేషన్ వివరాలు, దరఖాస్తు ప్రక్రియ కోసం అధికారిక వెబ్‌సైట్ https://kadapa.ap.gov.in/notice_category/recruitment/ ను సందర్శించాల్సి ఉంటుంది. దరఖాస్తుకు మే 31, 2022 వరకు అవకాశం ఉంది..ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోవాలి..