ఆర్‌బీఐ బ్యాంక్ వినియోగదారులకు శుభవార్త తెలిపింది. ఈ మేరకు గవర్నర్ శక్తికాంత్ దాస్ ఫండ్ ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించి ఆర్‌టీజీఎస్ సిస్టమ్ రోజంతా అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. ఈ సదుపాయం డిసెంబర్ నుంచి అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. ఆర్‌టీజీఎస్ ద్వారా కనీసం రూ.2 లక్షలను వరకు పంపేందుకు వీలుంటుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ విధానాన్ని కేవలం బ్యాంకింగ్ పనివేళల్లో మాత్రమే పంపే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ఈ స్కీంతో పాటు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో నిర్ణయాన్ని తీసుకుంది. పాలసీ సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యధావిధిగా కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఆర్‌బీఐ గవర్నర్ శక్తి కాంత్ దాస్ ఆధ్వర్యంలో ఎంపీసీ కమిటీలోని ఆరుగురు సభ్యులు అందరూ ఏకగ్రీవంగా వడ్డీ రేట్లను స్థిరంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు.
ఆర్‌బీఐ నిర్ణయంతో రెపో రేటు 4 శాతం వద్ద నిలకడగా కొనసాగుతోంది. అలాగే రివర్స్ రెపో రేటు 3.35 శాతం వద్ద స్థిరంగా ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు చూస్తే రెపో రేటును 115 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిందని, ఈ నిర్ణయంతో బ్యాంకుల్లో డబ్బులు దాచుకునే వారికి కొంత ఊరట లభించే అవకాశం ఉందన్నారు.
కేంద్ర ప్రభుత్వం ముగ్గురు ఆర్థిక వేత్తలైన జయంత్ వర్మ, అశిమా గోయల్, శశాంక భిందేను నియమించింది. వీరి ఆధ్వర్యంలో తొలి ఎంసీపీ సమావేశం జరుగనుంది. ఈ ఆరుగురు సభ్యులతో ఎంపీసీ మీటింగ్ సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 1వ తేదీన జరగాల్సి ఉండేది. కానీ, స్వతంత్ర సభ్యుల నియామకం ఆలస్యం కావడంతో సమావేశం వాయిదా పడింది. రిజర్వు బ్యాంక్ ఆగస్టు నెలలో జరిగి పాలసీ సమావేశంలో కూడా కీలక వడ్డీ రేట్లను స్థిరంగానే కొనసాగించింది. 2019 ఫిబ్రవరి నుంచి చూస్తే ఆర్ బీఐ రెపో రేటును 250 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించడంతో 2.5 శాతానికి రెపోరేటు దిగొచ్చింది.