బీటెక్ పాసైన వారికి గుడ్ న్యూస్.. రూ.46 వేల జీతంతో ఉద్యోగాలు..ఒక్కరోజే అవకాశం..

-

బీటెక్, డిప్లమో పాస్ అయ్యారా? ఉద్యోగాల కోసం వెతుకుతున్నారా? అయితే మీకు కళ్లు చెదిరే న్యూస్..బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజనీర్లు, టెక్నీషియన్స్, ఇతర పోస్టుల్ని భర్తీ చేస్తోంది. నేషనల్ ఆటోమోటీవ్ టెస్ట్ ట్రాక్స్ కోసం ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది. ఖాళీల సంఖ్యను అయితే ప్రకటించలేదు.. ఇక పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2023 మార్చి 27 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేయాలి.

కాగా, అధికారిక వెబ్‌సైట్‌లో అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసి, నోటిఫికేషన్‌లో వెల్లడించిన ఇమెయిల్ ఐడీకి చివరి తేదీలోగా చేరేలా పంపాలి. ఈ జాబ్ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు, దరఖాస్తు విధానం గురించి పూర్తి సమాచారన్ని తెలుసుకోవడం మంచిది..టెక్నీషియన్స్, ఇంజనీర్ల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది..నేషాల్ ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్స్ కోసం ఈ ఉద్యోగాల భర్తీ జరుగుతుండగా నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఎంతగానో ప్రయోజనం చేకూరుతుంది. త్వరలో ఉద్యోగ ఖాళీల సంఖ్యకు సంబంధించి మరో నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నారు..

ఆఫ్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కోసం అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.వేర్వేరు ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. టెక్నీషియన్ ల్యాబ్ / ఇన్‌స్ట్రుమెంటేషన్ ఉద్యోగ ఖాళీలకు అర్హతలతో పాటు 5 ఏళ్ల అనుభవం ఉండాలి. అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.అప్లికేషన్స్ ఆధారంగా నోటిఫికేషన్ లో మార్పులు జరిగే అవకాశం ఉందని సమాచారం..ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా 46,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. [email protected] వెబ్ సైట్ లింక్ కు అప్లికేషన్ ఫామ్ ను పూర్తి చేసి పంపాల్సి ఉంటుంది.. ఇక ఈ ఉద్యోగాల పై ఆసక్తి కలిగిన వాళ్ళు https://www.becil.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారన్ని తెలుసుకొని అప్లై చేసుకోగలరు..

Read more RELATED
Recommended to you

Latest news