కేంద్రం ఉద్యోగులకి గుడ్ న్యూస్ ని త్వరలో చెప్పనుంది. ఈ పండుగకి ముందే 6 కోట్ల మంది ఉద్యోగుల అకౌంట్స్ లోకి భారీగా డబ్బులు జమ చేయనుంది. వివరాల లోకి వెళితే.. పీఎఫ్ వడ్డీ రేటు ఉద్యోగస్తుల ఖాతాలోకి బదిలీ చేయనుంది. అయితే ఎప్పుడు జమ అవుతాయి అనేది తెలీదు. ఇంకా ప్రకటించలేదు.
ఇక ఇది ఇలా ఉంటే 8.1 శాతం వడ్డీ ప్రయోజనాన్ని ప్రస్తుతం ఉద్యోగస్తులు పొందుతున్నారు. ఇక ఎంత డబ్బులు ఖాతాల్లో పడతాయి అనేది చూస్తే.. ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో 10 లక్షల రూపాయలు ఉంటే అప్పుడు వడ్డీ కింద రూ.81000 వస్తాయి. అదే ఒకవేళ ఖాతాలో రూ. 7 లక్షలు ఉంటే వడ్డీ కింద రూ.56700 లభిస్తుంది. ఒకవేళ రూ.5 లక్షలు ఉంటే మీకు వడ్డీగా రూ.40,500 లభిస్తాయి. లక్ష ఉంటే రూ. 8100 లభిస్తుంది.
మీ పీఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్ ని ఇలా చెక్ చెయ్యండి:
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 011-22901406కు మిస్డ్ కాల్ ఇస్తే బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. తర్వాత మీరు EPFO సందేశం ద్వారా PF వివరాలను చూడచ్చు. లేదంటే ఆన్ లైన్ లో కూడా చూసుకోవచ్చు.
EPFO వెబ్‌సైట్‌కి వెళ్లి epfindia.gov.inలో ఇ-పాస్‌బుక్‌పై క్లిక్ చేసి
passbook.epfindia.gov.in కొత్త పేజీ వచ్చాక మీ వినియోగదారు పేరు, పాస్‌వర్డ్, క్యాప్చార్ ఎంటర్ చేసాక సభ్యుల IDని ఎంచుకోవలసి వుంది. ఇ-పాస్‌బుక్‌లో మీ EPF బ్యాలెన్స్ చూడచ్చు. ఉమాంగ్ యాప్ ద్వారా కూడా చూసుకోవచ్చు.