ప్రపంచం మొత్తం కరోనా వల్ల ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతకవలసి వస్తుంది.. ఇంత వరకు జీవితంలో ఎవరు ఊహించని విధంగా మానవుల జీవన శైలిని ఈ వైరస్ మార్చేసింది.. ఈ కరోనా వల్ల మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది.. ఈ మాయదారి రోగం తగ్గినట్టే తగ్గి మళ్లీ వింజృంభిస్తున్న దశలో దీనికి నివారణగా ఇంతవరకు వ్యాక్సిన్ కనుగోలేదు.. ఇకపోతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన వివరాల ప్రకారం, ప్రపంచంలో దాదాపుగా 70కి పైగా రీసెర్చ్ సంస్థలు ఈ కరోనా వ్యాక్సిన్ తయారీ కోసం శ్రమిస్తున్నాయట.. ఇలాంటి నేపధ్యంలో కరోనా మరణాలను తగ్గించగల ఔషధాన్ని పరిశోధకులు గుర్తించారు. ఇప్పటికే యూకేలో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో ఈ విషయాన్ని గుర్తించారట..
కాగా జనరిక్ స్టెరాయిడ్ డ్రగ్ అయిన డెక్సామెతాసోన్ అనే ఔషదాన్ని తక్కువ మోతాదులో కరోనా పేషెంట్లకు ఇవ్వడం వల్ల మరణాల ముప్పు మూడో వంతు తగ్గుతున్నట్లు పరిస్థితి విషమించిన వారిలో ఈ ఔషధం మెరుగైన పనితీరు కనబరుస్తోందని గుర్తించారట. ఇప్పటికే నిరాశ అలుముకున్న వారి విషయంలో ఇదో గొప్ప ముందడుగుగా పరిశోధకులు అభివర్ణించారు. ఇక ఈ ఔషధం చౌక ధరలో అందుబాటులో ఉందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మార్టిన్ ల్యాండ్రీ తెలుపగా, ఈ పరిశోధనల్లో పాల్గొన్న మరో శాస్త్రవేత్త అయిన పీటర్ హార్బీ మాట్లాడుతూ, కరోనా మరణాల రేటును తగ్గించే ఔషధం ఇదొక్కటేనని, మరణించే ముప్పును ఇది గణనీయంగా తగ్గిస్తోందని తెలిపారు. దీని బట్టి చూస్తే ముందు ముందు కరోనా రోగులకు మంచిరోజులు వస్తున్నట్లే అని అనుకుంటున్నారట..