తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తం గా నాలుగు జిల్లాలోని నాలుగు మండలాలకు దళిత బంధు నిధలును విడుదల చేసింది. ఆయా జిల్లాలో కలెక్టర్ ఖాతాల్లో కి దళిత బంధు నిధులను జమ చేసింది. ఎస్సీ కార్పోరేషన్ నుంచి ఈ విధులను విడుదల చేసింది. రాష్ట్రం లోని సూర్యాపేట జిల్లాకు రూ. 50 కోట్లు, ఖమ్మం జిల్లాకు రూ.100 కోట్లు. నాగర్ కర్నూల్ జిల్లాకు రూ. 50 కోట్లు, కామారెడ్డి జిల్లాకు రూ. 50 కోట్లు విడుదలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పోరేషన్ నుంచి నిధులను విడుదల చేసింది.
కాగ హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తామని ముఖ్య మంత్రి కేసీఆర్ తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తం గా దళితులకు రూ. 10 లక్షలను అకౌంటులో జమ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అంతే కాకుండా ఈ పథకం పలైట్ ప్రాజెక్ట్ గా రాష్ట్రం నలుమూలల నుంచి నాలుగు జిల్లాలను ఎంపిక చేసి అందులో నుంచి నాలుగు మండలాలను ఎంపిక చేశారు. ఆ మండలాల్లో ఉన్న దళితులకు ఈ రోజు నిధులను విడుదల చేశారు.