ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ వినియోగదారులకు గుడ్ న్యూస్…!

-

ప్రస్తుతం ఇప్పుడు ట్రెండ్ అంతా సోషల్ మీడియా మీదే నడుస్తుంది. ఫేస్ బుక్ అని, ఇంస్టాగ్రామ్ అని ప్రతి ఒక్కరు సోషల్ మీడియానే అనుసరిస్తున్నారు. సామాన్య మానవుడి దగ్గర నుండి సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులు సైతం ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ ను వాడుతున్నారు. అయితే ఇప్పుడు ఫేస్ బుక్ వాడే యూజర్లకు ఒక శుభవార్తను అందించింది. అదేంటి అంటే.. ఫేస్ బుక్ మెసెంజర్ లో క్రాస్ ఫ్లాట్ ఫారం ద్వారా ఒక కొత్త ఫీచర్ ను తాజాగా విడుదల చేసింది. ఇకమీదట ఇంస్టాగ్రామ్ నుంచి మెసెంజర్ కు డైరెక్ట్ గా మెసేజ్ చేసుకునే అవకాశాన్ని కలిపించింది.

మునిపటిలా ఇంస్టాగ్రామ్ కు కొత్త అప్ డౌన్ లోడ్ చేసుకోకుండా మెసెంజర్ యాప్ లోనే యూజర్లతో చాట్ చేసుకోవచ్చు అన్నమాట. కానీ ఈ రెండు యాప్స్ (ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్) దేనికి దానికి స్వాతంత్రముగా ఉన్నందున్న వినియోగాగురుల ఇన్ బాక్స్ మెసేజెస్ వేరువేరుగా కొనసాగుతాయి. అలాగే ఫేస్ బుక్ మెసెంజర్, ఇంస్టాగ్రామ్ కు సంబంధించి సరికొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తెచ్చామని ఇంస్టాగ్రామ్ అధినేత ఆడమ్ మొస్సోరీ, అలాగే మెసెంజర్ హెడ్ అయిన స్టాన్ చూడీనో విస్కీ తెలిపారు. ఇంకో కొత్త ఫీచర్స్ కూడా అప్డేట్ చేసినట్లు తెలుస్తుంది. సెల్ఫీ స్టిక్కర్స్ తో పాటుగా మరిన్ని 10 రకాల కొత్త ఫీచర్స్ ను కూడా అందుబాటులోకి తెచ్చారు.

చాట్ కలర్స్, రకరకాల ఎమోజీలు, యానిమేటెడ్ బొమ్మలు కూడా ఉన్నాయి. కానీ, ఎండ్-టూ-ఎండ్ ఎన్క్రిప్షన్ పై ఎటువంటి హామీ మాత్రం ఇవ్వలేదు. అందుచే దీన్ని యూజ్ చేసే యూజర్లు జాగ్రత్త పడాలిసిందే. ఇప్పటికి ఈ అప్ డేట్ అనేది కొంతమందికి మాత్రమే పరిమితం చేసింది. రాబోయే రోజుల్లో అందరికి అందుబాటులోకి వచ్చేలా చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news