ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్… వారి ఖాతాలోకి డబ్బులు…!

ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెబుతోంది. అర్హులకు రూ.10 వేలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా చూస్తే.. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా స్కీమ్ కింద వైఎస్ జగన్ ప్రభుత్వం మత్స్యకారుల బ్యాంక్ ఖాతాల్లో రూ. 10,000 జమ చేయనుంది. దీనితో మత్సకారులకి డబ్బులు వస్తాయి.

సముద్రాల్లో చేపలు, రొయ్యల సంతానోత్పత్తి కాలంలో చేపలు, రొయ్యల సంరక్షణకు ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు వేటను నిషేధిస్తారు. దీని మూలంగా వాళ్ళకి ఉపాధి ఉండదు. అందుకే వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కింద అర్హులైన లబ్ధిదారులకు మే 18న రూ.10 వేలు వస్తాయి. ఈ స్కీమ్ కింద దాదాపు 1.32 లక్షల మంది ప్రయోజనం పొందనున్నారు.

ఈ డబ్బులు వస్తే వాళ్ళకి ఊరట కలుగుతుంది. ఒక పక్క ఉపాధి లేకపోవడం మరో పక్క కరోనా.. ఈ సమయం లో వీరికి రూ.10 వేలు వస్తే కొంచెం రిలీఫ్ వస్తుంది. ఇది ఇలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కూడా వైఎస్ఆర్ రైతు భరోసా కింద డబ్బులు అందించనుంది. మే 13న రైతులకు ఈ స్కీమ్ కింద రూ.5,500 బ్యాంక్ అకౌంట్లలో జమ కానున్నాయి.