హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్…!

-

మీకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లో ఖాతా ఉందా..? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దీనితో కస్టమర్స్ కి మంచి బెనిఫిట్స్ కలుగుతాయి.

ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే… స్థానిక లాక్ డౌన్స్ కారణంగా బ్యాంక్ కస్టమర్లకు అసౌకర్యం కలుగకూడదని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మొబైల్ ఏటీఎం సేవలు ఆవిష్కరించింది. ప్రస్తుతం బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే తెరిచి ఉంటాయి.

కాగా మొబైల్ ఏటీఎంల వల్ల కస్టమర్లకు ప్రయోజనం కలుగనుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకుంది. దీనితో ఇక నుండి దేశ వ్యాప్తంగా మొబైల్ ఏటీఎం సేవలు అందుబాటు లో ఉంటాయని బ్యాంక్ అంది. హైదరాబాద్ సహా దేశం లో 19 ప్రధాన ప్రాంతాల లో మొబైల్ సేవలు అందుబాటు లో ఉంటాయని బ్యాంక్ వెల్లడించింది.

ఇది ఇలా ఉండగా స్థానిక సంస్థల తో చర్చించి మొబైల్ ఏటీఎంలు ఏఏ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచాలో బ్యాంక్ ఒక నిర్ణయానికి రానుంది. ఇప్పుడు ఈ సౌకర్యం వుంది కనుక ఏటీఎంలో డబ్బులు తీసుకోవడానికి ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు. మీరు ఉంటున్న ప్రదేశానికే ఏటీఎం వస్తుంది. కాబట్టి కస్టమర్స్ ఈ సర్వీసుల తో బెనిఫిట్స్ పొందొచ్చు. ఇబ్బంది కూడా ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news