హైదరాబాద్ వాసులకు శుభవార్త.. ఇక ఆన్ లైన్ లోనే నల్ల బిల్లులు

హైదరాబాద్ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇక ఇంటింటికి, అపార్ట్మెంట్ కు అలాగే పరిశ్రమల వద్దకు వెళ్లి నీటి బిల్లులు జారీ చేసే విధానానికి స్వస్తి పలకనుంది జలమండలి. అలాగే బిల్లులో జారీ నుంచి వసూలు వరకు పూర్తిస్థాయిలో ఆన్లైన్ విధానంలోనే చేయాలని నిర్ణయం తీసుకుంది జలమండలి. జలమండలి డివిజన్ కార్యాలయాల వద్ద నగదు చెల్లింపులు, చెక్కులు తీసుకోవడం తదితర విధానాలు ముందు అందుబాటులో ఉండవు.

ఈ నల్ల బిల్లులను పూర్తిగా ఆన్లైన్లో చెల్లించేందుకు రంగం సిద్ధం చేశారు అధికారులు. తొలుత వాణిజ్య నల్లాల కు జనవరి ఒకటో తేదీ నుంచి ఈ ప్రక్రియ అమలులోకి రానుంది. ఈ విషయాన్ని జలమండలి ఎండీ దాన కిషోర్ ఇవాళ ప్రకటించారు. ఆ తర్వాత.. మామూలు ప్రజలంతా… ఆన్లైన్లోనే నల్ల బిల్లులను కట్టాలని.. ఈ రూల్ ఏప్రిల్ 1వ తేది నుంచి పూర్తి స్థాయిలో అమలు కానుందని ఆయన తెలిపారు. ఆన్లైన్ విధానంలో బోర్డు ఆదాయం పెరుగడంతో పాటు మోసాలకు కూడా అడ్డుకట్ట పడనుంది. గ్రేటర్ వ్యాప్తంగా 12 లక్షల నల్లాలు ఉన్నాయి. అందులో 70 శాతం గృహాలకు చెందినవే. వీటి నుంచి ఏకంగా 36 కోట్ల ఆదాయం వస్తోంది. ఆన్లైన్ విధానంలో బిల్లులు చెల్లించడం ద్వారా ఈ ఆదాయం మరింత పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు భావిస్తున్నారు.