ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్..ఆ ఫీజు చెల్లించడానికి మరో అవకాశం..

-

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. వారంలో రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా విద్యా సంస్థలకు మూడు రోజులు సెలవులు ప్రకటించిన విషయ తెలిసిందే..కాగా, ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు, ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు జూలై 8తో ముగిసింది. అయితే ఈ వారం రోజులుగా వర్షాలు పడటంతో .. విద్యార్థులు ఫీజు కట్టడంలో ఇబ్బందులు ఎదురైన వారికి మరో అవకాశం కల్పించారు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు .

తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించేందుకు మరో రెండు రోజులు అవకాశం ఇచ్చారు. ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలు, ఇంటర్ ఫెయిలైన విద్యార్థులు ఈ నెల 18 మరియు 19వ తేదీల్లో రూ. 200 ఫైన్ తో ఫీజు చెల్లించవచ్చని ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.జూలై 26 నుంచి 30 వరకు ప్రాక్టికల్స్‌ నిర్వహిస్తారు.

ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వ్యాల్యూస్‌ ఎగ్జామ్‌ జూలై 22న, ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్ష జూలై 23న ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు ఉంటుంది. ఆగస్టు 1 నుంచి 10 వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఫస్టియర్‌ విద్యార్థులకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు సెకండియర్‌ విద్యార్థులకు ఉంటుంది.అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలకు గానూ మొత్తం 3,48,171 మంది విద్యార్థులు పరీక్ష ఫీజు కట్టారు. ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులు 1,34,329 మంది, సెకండ్‌ ఇయర్‌ సప్లమెంటరీ విద్యార్థులు 1,13,267 మంది ఉన్నారు. ఫస్ట్‌ ఇయర్‌ ఇంప్రూవ్‌మెంట్‌ రాసేవారు 99,667 మంది ఉండగా, సెకండ్‌ ఇయర్‌లో కేవలం 15 మంది మాత్రమే ఉన్నారు. బ్రిడ్జికోర్సుకు చెందిన వారు మరో 893 మంది ఉన్నారు. పరీక్ష ఫీజుకు మరో రెండు రోజుల ఇవ్వడంతో పరీక్ష రాసే వారి సంఖ్య పెరగనుందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news