BREAKING: ఏపీ వరద భాదితులకు సీఎం జగన్ భారీ సాయం..!!

-

గత కొద్ది రోజులుగా ఏపీలో ఎడతెరపి లేకుండా భారీగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. భారీగా కురిసిన వర్షాలకు పలు ప్రాంతాలు అంధకారంలో మునిగిపోయాయి..ఎటు చూసినా జలమయం.. బయటకు వచ్చే పరిస్థితి కనిపించలేదు..గోదావరి నది గతంలో ఎన్నడూ లేని విధంగా ఉప్పొంగడంతో అనేక మంది వరద లో చిక్కుకున్నారు.వరదల దృష్ట్యా తీసుకోవాల్సిన సహాయక చర్యలపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు..
ఏరియల్‌ సర్వే తర్వాత వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో ఆయన సమీక్షించారు. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్‌ బీ.ఆర్‌.అంబేడ్కర్‌, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు సహా పలు జిల్లాల అధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు..

మరో 24 గంటల అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. వరద ప్రభావిత జిల్లాల నుంచి కలెక్టర్లు, ఎస్పీలు ఎలాంటి సహాయం కోరినా యుద్ధ ప్రాతిపదికన వారికి అందించాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎస్‌ సహా అన్ని విభాగాల కార్యదర్శులకు సూచించారు..నేడు గోదావరి నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని సమాచారం అందిందని, గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు..వరద ప్రభావం ఉన్న గ్రామాలన్నింటినీ ఖాళీచేయాలని, గోదావరి గట్లకు ఆనుకుని ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. గట్లు బలహీనంగా ఉన్నచోట గండ్లు లాంటివి పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ముంపు మండలాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు సీఎం ఆదేశించారు. వరద బాధితులకు ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలని, బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రతి కుటుంబానికీ 25 కేజీల బియ్యం, కిలో కందిపప్పు, కిలో బంగాళాదుంపలు, కిలో పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, పాలు అందించాలని ఆదేశించారు.

48 గంటల్లో వరద ప్రభావిత కుటుంబాలకు వీటిని చేర్చాలన్నారు. సహాయ శిబిరాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి రూ.2వేలు ఇవ్వాలన్నారు. రాజమహేంద్రవరంలో రెండు హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నాయని అత్యవసర సర్వీసుల కోసం, పరిస్థితిని సమీక్షించేందుకు వాటిని వినియోగించుకోవాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా, తాగునీరు కలుషితం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం నిర్దేశించారు. అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు..ప్రజలతో ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేయడం, భద్రతా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు…

Read more RELATED
Recommended to you

Latest news