ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆయుధ పూజ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?

-

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న మూవీ దేవరకు సంబంధించిన క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమాలోని ఆయుధ పూజ సాంగ్‌ను రేపు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. రేపు (గురువారం) ఉదయం 11.07 గంటలకు సాంగ్ అందుబాటులో ఉంటుందని తెలియజేస్తూ ఫోటోను మేకర్స్ పంచుకున్నారు.

ఇదిలాఉండగా, ఈనెల 27న దేవర మూవీ విడుదల కానుంది. అయితే, ఈ సినిమాకు తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అధ్బుతమైన మ్యూజిక్ అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలు సోషల్ మీడియాలను, యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా తక్కువ టైంలోనే ఎక్కువ వ్యూయర్ షిప్‌ను సొంతం చేసుకుంది. కాగా, దేవర మూవీలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు మూవీ ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఎన్టీఆర్ లుక్, మాస్ ఎలిమెంట్స్, సాంగ్స్‌కు రెస్పాన్స్ భారీగా రావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news