ఎడిట్ నోట్: అంతా పవన్‌ చేతుల్లోనే..!

-

ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ఇప్పుడు ఓ కీ మాదిరిగా ఉన్నారు..రాజకీయం ఎలాంటి మలుపులు తిరగాలన్న ఆయన్న చేతుల్లోనే ఉంది.  కాకపోతే ఇప్పటికిప్పుడు ఆయనకు గెలిచి..అధికారంలోకి వచ్చే అవకాశాలు ఏ మాత్రం లేవు. జనసేన సింగిల్ గా గెలవడం చాలా కష్టమైన పని. బీజేపీతో పొత్తులో ఉన్నా సరే పావలా ప్రయోజనం లేదు. ఏదో కేంద్రం సపోర్ట్ తప్ప..రాష్ట్రంలో ఆ పార్టీకి ఏ మాత్రం బలం లేదు.

దీని వల్ల బీజేపీ వల్ల జనసేనకు ఓట్లు పెరగడం కష్టం. ఇక జనసేనకు సింగిల్ గా 10 శాతం ఓటు బ్యాంక్ వరకు వచ్చింది..దాంతో అధికారంలోకి రావడం జరిగే పని కాదు. కానీ పవన్‌కు గెలుపోటములని తారుమారు చేసే శక్తి ఉంది. అందుకే నెక్స్ట్ ఎన్నికల్లో కీ రోల్ పవన్‌దే అని చెప్పాలి. ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో రాష్ట్రంలో వైసీపీ-టీడీపీ ఢీ అంటే ఢీ అనే పరిస్తితుల్లో ఉన్నాయి. కాకపోతే అధికారంలో ఉండటం, అన్నీ రకాల మద్ధతు వైసీపీకి ఎక్కువ ఉంది. అంటే కొద్దో గొప్పో ఇప్పుడు వైసీపీకే ఆధిక్యం ఉంది. అలా అని గత ఎన్నికల్లో వచ్చిన 49 శాతం ఓటు బ్యాంక్ ఇప్పుడు లేదు.

ఇప్పుడు ఓటు బ్యాంక్ తగ్గిందనే సర్వేలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీకి 39 శాతం ఓట్లు వచ్చాయి. ఇప్పుడు అది కాస్త పెరిగిందని తెలుస్తోంది. కానీ వైసీపీని టీడీపీ దాటలేదని తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్తితులని బట్టి చూస్తే..గతంతో పోలిస్తే తక్కువ సీట్లు గెలుచుకున్నా..వైసీపీకే మళ్ళీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా అని టీడీపీని తక్కువ అంచనా వేయలేం..ఎన్నికల నాటికి కాస్త సీన్ మారే ఛాన్స్ ఉంది.

అయితే ఇప్పుడు వైసీపీని ఓడించాలన్న, టీడీపీని గెలిపించాలన్న పవన్ చేతుల్లోనే ఉంది. ఆయన గాని టీడీపీతో కలిస్తే..వైసీపీకి రిస్క్. అలా కాకుండా సెపరేట్‌గా పోటీ చేస్తే మళ్ళీ ఓట్లు చీలిపోయి టీడీపీకి నష్టం..వైసీపీకి లాభం. అంటే ఏం చేసినా పవన్ చేతుల్లోనే ఉంది..కాకపోతే పవన్..ఇప్పుడు బీజేపీ చేతుల్లో ఉన్నట్లు కనిపిస్తోంది. బీజేపీకి ఏమో టీడీపీతో కలవడం ఇష్టం లేదు. అందుకే పవన్‌ని సైతం టీడీపీకి దూరం చేయాలని చూస్తుంది.

అలా చేస్తే పరోక్షంగా వైసీపీకి బెనిఫిట్ అయ్యేలా బీజేపీ చేస్తుంది. ఈ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే..నెక్స్ట్ టీడీపీని దెబ్బకొట్టి జనసేన ద్వారా తాము ఎడగవచ్చు అనేది బీజేపీ కాన్సెప్ట్. 2029లో అయిన వైసీపీకి జనసేన-బీజేపీ గట్టి పోటీ ఇస్తాయని కమలం నేతలు భావిస్తున్నారు. కానీ పవన్‌కు మాత్రం జగన్‌ని అధికారంలోకి నుంచి దించేయాలని ఉంది..అలాంటప్పుడు టీడీపీతో కలవాలి. ఇంకా ఏదేమైనా పవన్‌తోనే ఉంది. బీజేపీ కలిసొస్తే ఓకే లేదంటే టీడీపీతో పవన్ కలవడం..లేదా టీడీపీని వదిలేసి బీజేపీతో కలిసి ఓట్లు చీల్చి మళ్ళీ వైసీపీకి బెనిఫిట్ వచ్చేలా చేయడం. మరి పవన్ ఎటువైపు వెళ్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news