పేద ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. రూ.100కోట్లు కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం

-

నగరంలోని జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం, వాంబే ఇండ్ల మరమ్మతులకు రూ.100కోట్లు కేటాయించినట్లు రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. హెచ్‌ఎండీఏ నుంచి కేటాయించిన ఈ నిధులతో మరమ్మతులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కేటీఆర్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు పలువురు ఆయా కాలనీల్లోని ప్రజలు మరమ్మతుల కోసం నిధులు వెచ్చించుకోలేరని, ప్రభుత్వమే వారికి అవసరమైన విధులను అందిస్తే బాగుంటుందన్న విజ్ఞప్తి చేశారు. వేల సంఖ్యలో పేదల లబ్ధి చేకూరుతుందంటే నిధులను వెచ్చించేందుకు ప్రభుత్వం ఏమాత్రం వెనుకాడబోదని కేటీఆర్‌ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను రూ.9100 కోట్లతో నిర్మించి పేదలకు ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. కొన్ని నిధులతో వేల సంఖ్యలో పేదలకు లబ్ధి చేకూరుతుందంటే ప్రభుత్వం ఏ మాత్రం వెనకాడదన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన నిధులు మంజూరు చేశారు. 100 కోట్ల రూపాయల నిధులను పేదల ఇళ్ల మరమ్మతుల కోసం కేటాయిస్తున్నట్లు తెలిపారు కేటీఆర్. హెచ్‌ఎండీఏ ఇచ్చే నిధులతో ఈ మరమ్మతులను పూర్తి చేసేందుకు జీహెచ్‌ఎంసీ బాధ్యతలు తీసుకుంటుందని వెల్లడించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version