మొక్కలు బాగా పెరగాలంటే.. వీటిని తప్పక పాటించాలి..!

-

చాలామంది ఇళ్లలో మొక్కల్ని పెంచుకోవాలని అనుకుంటుంటారు. ఇంట్లో మొక్కలు ఉంటే ఇల్లు చాలా అందంగా ఉంటుంది చక్కటి ప్రశాంతత ఉంటుంది మొక్కలు బాగా పెరగాలంటే వీటిని పాటించండి. ఇలా కనుక మీరు చేసినట్లయితే మీ ఇంట్లో మొక్కలు బాగా ఎదుగుతాయి ఇంటికి సూర్యకాంతి ఏ స్థాయిలో వస్తుందో చూసి దానికి తగ్గట్టుగా మొక్కల్ని పెంచుకుంటే మొక్కలు బాగా పెరుగుతాయి.

మొక్కలకి చాలామంది ఎక్కువ నీళ్లు పోసేస్తూ ఉంటారు నీళ్లు తక్కువైనా పరవాలేదు కానీ ఎక్కువగా నీళ్లు పోస్తే మాత్రం మొక్కలు చనిపోతాయి అని గుర్తుపెట్టుకోండి. మొక్కల మట్టి తేమగా ఉండేటట్టు చూసుకోవాలి అదే ముళ్ళ మొక్కలకైతే కొంచెం పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా చేస్తే మొక్కలు బాగా పెరుగుతాయి మొక్కల వాతావరణం ఎప్పుడు ఒకే విధంగా ఉండేటట్టు చూసుకోవాలి వేడి అతి చల్లదనం లేకుండా చూసుకోండి.

చాలామంది మొక్కలు బాగా పెరగాలని ఉద్దేశంతో ఎరువులు ఎక్కువగా వాడుతుంటారు ఎరువులు ఎక్కువగా వాడినా కూడా సమస్య. కాబట్టి ఎరువులు మరీ ఎక్కువగా వాడకండి మొక్కల్ని ఎప్పుడూ స్టోర్లలో కంటే నర్సరీలో కొనండి. ఆరు నెలలకి ఒకసారి కుండీలో మట్టిని మారుస్తూ ఉండండి తర్వాత మొక్కలకి పోషకాలు బాగా వస్తాయి. కుండీలకి తప్పనిసరిగా కింద కన్నం ఉండేటట్లు చూడండి అధిక నిరు ఆ కారణాల ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఇలా కనుక మీరు మొక్కల్ని పెంచినట్లయితే కచ్చితంగా మొక్కలు బాగా ఎదుగుతాయి మొక్కలు చనిపోవడం వంటి సమస్యలు రావు పూలు కూడా బాగా పూస్తాయి

Read more RELATED
Recommended to you

Exit mobile version