పోస్టల్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇక నుండి ఆ సేవలు ఇంటి వద్దకే..!

-

పోస్టల్ కస్టమర్స్ కి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు (ఐపీపీబీ), ఎన్‌పీసీఐ భారత్ బిల్‌పే గుడ్ న్యూస్ చెప్పారు. భారత్ బిల్‌పే ప్లాట్‌ఫాం ద్వారా యూజర్ల ఇంటి వద్దే క్యాష్-బేస్డ్ అసిస్టెడ్ బిల్లు చెల్లింపులకు ఫెసిలిటీని కల్పించనున్నాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే… యూజర్లు ఈ సర్వీసులని గ్రామీణ డాక్ సేవక్స్, పోస్టల్ సిబ్బంది సహాయంతో భారతదేశం అంతటా ఉపయోగించుకోచ్చు అని ఐపీపీబీ తెలిపింది.

India Post‌ Payments‌

నాన్-ఐపీపీబీ కస్టమర్‌లందరికీ వివిధ యుటిలిటీ, ఇతర రిక‌రింగ్‌ సేవల కోసం బిల్లులను చెల్లించడానికి కూడా భారత్ బిల్‌పే ప్లేట్ ఫామ్ ని కలిపించింది. ఈ కొత్త ఫెసిలిటీతో ఇంటి నుంచే కాకుండా తమ సమీపంలోని పోస్టాఫీసు ద్వారా కూడా రిక‌రింగ్‌ బిల్లులను పే చెయ్యచ్చు.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్, ఐపీపీబీ టెక్నాలజీ-ఆధారిత డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫాం నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవడం ద్వారా, భారత్ బిల్‌పే అన్ని బిల్లుల చెల్లింపు కోసం వన్-స్టాప్ ఎకోసిస్టమ్‌ను ఇస్తోంది. భారతదేశం అంతటా ఉన్న కస్టమర్‌లందరికీ ఎప్పుడైనా ఎక్కడైనా బిల్లు చెల్లించే సేవలనిస్తోంది.

ఈ ట్రాన్సాక్షన్లన్నీ చాలా సురక్షితంగా ఉంటాయి కూడా. దీని ద్వారా ఎలాంటి రిక‌రింగ్‌ బిల్లులనైనా క్యాష్ మోడ్ ద్వారా చెల్లించొచ్చు. దాదాపు అన్ని వివరాలతో ట్రాన్సాక్షన్ హిస్టరీ అప్‌డేట్ అవుతుంది. అలానే బిల్ పేమెంట్ ట్రాన్సాక్షన్ల కోసం ఆన్‌లైన్‌లో ట్రాక్ చెయ్యచ్చు, కంప్లైన్ట్ చెయ్యచ్చు. అప్‌డేటెడ్ ఆన్-స్క్రీన్ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ పొందొచ్చు. అలానే నోటిఫికేషన్‌లు, స్నూజ్ అలర్ట్స్ & రిమైండర్‌లను ఎనేబుల్ చేయవచ్చు. ట్రాన్సాక్షన్ అలర్ట్స్, రిమైండర్‌లను సెట్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news