కర్ణాటకలో నమోదైన మరో ఓమిక్రాన్ కేసు.. దేశంలో 36కు చేరిన ఓమిక్రాన్ కేసుల సంఖ్య..

-

దేశంలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న కేసుల సంఖ్య గత మూడు రోజుల నుంచి కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల ఒకే రోజు 9 కేసులు నమోదు కాగా…తాజాగా ఇవ్వాల ఒక్క రోజే ఇప్పటి వరకు 3 కొత్త ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు ఏపీలో, ఛండీగడ్ లో ఒక్కో కేసు నమోదు కాగా.. తాజాగా కర్ణాటకలో మరో కేసు వెలుగులోకి వచ్చింది. దక్షిణాఫ్రికా నుంచి కర్ణాటక వచ్చిన 34 ఏళ్ల వ్యక్తికి పరీక్షించగా ఓమిక్రాన్ పాజిటివ్ గా తేలింది. ఈయనతో సంబంధం ఉన్న 5 ప్రైమరీ కాంటాక్ట్ లను, 15 సెకండరీ కాంటాక్ట్ లను అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఓమిక్రాన్ సోకిన వ్యక్తిని ఐసోలేషన్ లో ఉంచి చికిత్సను అందిస్తున్నారు.

మరోవైపు దేశంలో ఓమిక్రాన్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు ఇండియాలో 36 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అన్నింటి కన్నా ఎక్కువగా మహారాష్ట్రలో 17 కేసులు నమోదయ్యాయి. మిగతా రాష్ట్రాల్లో కేసులను పరిశీలిస్తే, కర్ణాటకలో 3, రాజస్థాన్ 9, ఢిల్లీ 2, ఛండీగడ్ 1, గుజరాత్ 3, ఏపీ 1 కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news