రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ గుడ్ న్యూస్ చెప్పింది. ట్రైన్ టికెట్ ధరలు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. ట్రైన్ టికెట్ ధరలు తగ్గినట్టు ఇండియన్ రైల్వేస్ వెల్లడించింది. అయితే ఇండియన్ రైల్వేస్ తీసుకున్న నిర్ణయం వల్లనే ఈ మార్పు వచ్చింది అని తెలుస్తోంది.
ఇది ఇలా ఉంటే స్పెషల్ ట్రైన్స్ ఇక పై రెగ్యులర్ ట్రైన్స్ మాదిరిగానే నడుస్తాయని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. దీంతో ఈ ట్రైన్స్ లో టికెట్ ధరలు తగ్గాయి. గతం లో ఇండియన్ రైల్వేస్ కరోనా మహమ్మారిని దృష్టి లో పెట్టుకుని.. ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఇండియన్ రైల్వేస్ టికెట్ ధరల్ని పెంచడం జరిగింది.
ఎక్కువ టికెట్ ధరల తో రైళ్లని నడిపించింది. అయితే ఇప్పుడు మాత్రం స్పెషల్ ట్రైన్స్ ట్యాగ్ ఉండదు. ఇకపై అన్ని ట్రైన్స్ రెగ్యులర్ ట్రైన్ల మాదిరే ఉంటాయి. అందుకనే టికెట్ ధరల లో కూడా మార్పు వచ్చింది. ఈ నిర్ణయాన్ని ఇప్పటికే అమలు లోకి వచ్చింది. ఇండియన్ రైల్వేస్ జోనల్ రైల్వేస్‌కు కూడా ఈ విషయాన్ని తెలిపింది. కోవిడ్ 19 మునపటి టికెట్ ధరలనే అమలు చేయాలని ఆదేశించింది. ఇది ప్రయాణికులకు ఊరట కలిగిస్తోంది.