రూపే కార్డు ఉన్నవాళ్ళకి శుభవార్త.. ఆ కొనుగోళ్లపై భారీ డిస్కౌంట్స్..!

మీకు రూపే కార్డు ఉందా..? ఉంటే నిజంగా మీకు ఇది శుభవార్త అనే అనాలి. అదేమిటి రూపే కార్డు ఉన్న వాళ్ళకి శుభవార్త అని అనుకుంటున్నారా..? ఇంకెందుకు పూర్తి వివరాలు ఇవే ఆలస్యం చేయకుండా చూసేయండి. పండగ సమయం అంటేనే మనకి బంపర్ ఆఫర్స్ వస్తూ ఉంటాయి కదా.. అలానే రూపే కార్డు తో కూడా ఒక బంపర్ ఆఫర్ వచ్చింది. అదేమిటంటే…? కొన్ని బ్రాండ్ల ఉత్పత్తులపై ఇప్పుడు ఏకంగా 65 శాతం వరకు డిస్కౌంట్ ని అందిస్తున్నారు. దీనిలో కేవలం షాపింగ్ మాత్రమే కాదు. మీరు ఫుడ్, ఎంటర్‌టైన్‌మెంట్, హెల్త్, ఫిట్‌నెస్, ఎడ్యుకేషన్, ఫార్మసీ ఇలా ఎందులో నైనా మీరు కొనుగోలు చేసిన ఈ ఆఫర్ వర్తిస్తుంది.

ఎన్‌పీసీఐ (National Payments Corporation of India) ‘రూపే ఫెస్టివ్ కార్నివాల్’ పేరుతో ఈ ఆఫర్‌ ను పండగల సందర్భంగా ప్రత్యేకంగా తీసుకు రావడం విశేషం. దీనిని తీసుకు రావడానికి గల కారణం ఏమిటంటే..? సేఫ్, కాంటాక్ట్‌లెస్, క్యాష్‌లెస్ పేమెంట్లను ప్రోత్సహించడానికి. ఈ విషయాన్నీ స్వయంగా NPCI సోమవారం (అక్టోబర్ 26) న ఒక ప్రకటన లో తెలిపింది. ఇది ఇలా ఉండగా ఇందులో ఆకర్షణీయమైన డిస్కైంట్లని కూడా ప్రకటించడం జరిగింది.

అమెజాన్, స్విగ్గీ లాంటి ఇ-కామర్స్ సంస్థల ఉత్పత్తులతో పాటు శాంసంగ్ లాంటి ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులపై ఈ డిస్కౌంట్లు వర్తిస్తాయని తెలిపింది. అంతేకాదు వివిధ ఉత్పత్తుల కొనుగోళ్ల పై 10 నుంచి 65 శాతం వరకు డిస్కౌంట్లు లభిస్తాయని ఎన్‌పీసీఐ చెప్పడం కూడా జరిగింది. ఈ ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, ప్రయోజనాలను మా కస్టమర్లు ఈ దసరా పండుగ సందర్భంగా పొందుతారని ఆశిస్తున్నాం అని సంస్థ యాజమాన్యం తెలిపింది. అలానే డిజిటల్, కాంటాక్ట్ ‌లెస్ పేమెంట్స్‌ను అందిపుచ్చుకుంటారని భావిస్తున్నాం అని ఎన్‌పీసీఐ మార్కెటింగ్ విభాగం చీఫ్ కునాల్ కలవాటియా అన్నారు.