ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. బాపట్ల మెడికల్ కాలేజ్ భూసేకరణ పూర్తయింది అని ఆయన అన్నారు. వచ్చే నెలలో కాలేజ్ నిర్మాణానికి శంఖు స్థాపన చేస్తాం అని ఆయన పేర్కొన్నారు. జనవరి 26 నాటికి కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నాం అన్నారు. వాన్ పిక్ విషయంలో రైతులను గందరగోళంలో పడేయవద్దు అని ఆయన అన్నారు.
రైతుల వద్ద నుండి మార్కెట్ రేటు కంటే అధిక ధరకు భూములు కొన్నారని ఆయన తెలిపారు. రైతులు రిజిస్ట్రేషన్ కూడా చేశారు అని చెప్పారు. నిజాపట్నం పోర్టును అభివృద్ధి చేస్తాం అని ఆయన స్పష్టం చేసారు. నవంబర్ లో స్వల్పకాలిక శాసనసభ సమావేశాలు ఉండే అవకాశం ఉంది అని ఆయన పేర్కొన్నారు.