మా ఇళ్లని కూడా చిందరవందర చేశారు.. మేమేమన్నా అన్నామా ?

దుబ్బాకలో బీజేపీ కి నాయకులే లేరని మంత్రి హరీష్ రావు అన్నారు. ఓడిపోతామనే భయంతోనే ఆ పార్టీ యాగీ చేస్తుందని అయన అన్నారు. డబ్బులు బీజేపీ వి కాకుంటే… రఘునందన్ డబ్బులు దొరికిన ఇంటికి ఎందుకు వచ్చారని అయన ప్రశ్నించారు. తేలు కుట్టిన దొంగల్లా..బీజేపీ నేతలున్నారని డబ్బులు దొరికిన ఇంట్లో వ్యక్తి వాయిస్ రికార్డ్ ని ఎన్నికల కమిషన్ బయట పెట్టాలని మంత్రి కోరారు. మేము ఎన్నికల్లో ప్రజలను నమ్ముకుంటాం… అధికారులను కాదని అయన అన్నారు.

ఎన్నికల కోడ్ జిల్లా మొత్తం ఉంటుంది… ఎక్కడైనా తనిఖీ చేస్తారని హరీష్ రావు అన్నారు. బీజేపీ నాయకులకు అది కూడా తెలియదా..? అని అయన ఎద్దేవా చేసారు. 8 చోట్ల తనిఖీలు అని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్న ఆయన బీజేపీ నాయకుల ఇండ్లమీదే కాదు… నా సన్నిహితుడు మున్సిపల్ చైర్మన్ ఇంట్లో కూడా తనిఖీ చేశారనని మా వాళ్ళ ఇంట్లో కూడా చిందర వందర చేశారు.. అయినా మేము సహకరించామని ఆయన అన్నారు. బీజేపీ యాగీ చేస్తే నాలుగు ఓట్లు వస్తాయని భ్రమలో ఉందని అదంతా కుదిరే పని కాదని అన్నారు.