తిరుమల శ్రీవారి భక్తులకు అదిరిపోయే శుభ వార్త చెప్పింది టిటిడి పాలకమండలి. సర్వ దర్శనం టికెట్లు పెంచాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తిరుమలలో ప్రతి రోజు 30 వేల ఉచిత టిక్కెట్ల టీటీడీ పాలకమండలి ఇస్తోంది.
అయితే సమ్మర్ కావడంతో భక్తులు తిరుమల కు భారీగా వస్తున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో ఉచిత టిక్కెట్లను 45 వేలకు పెంచాలని టితిడి కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం భక్తుల రద్దీ పెరగడంతో పాలక మండలి నిర్ణయం తీసుకుంది. అలాగే భక్తుల రద్దీ కారణంగా విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. రేపటి నుంచి ఆదివారం వరకు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ కీలక ప్రకటన చేసింది టీటీడీ పాలకమండలి. దీంతో సామాన్య భక్తులకు భారీ ఊరట లభించనుంది.