రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణ పర్యాటక ప్రాంతాలను, చారిత్రాత్మక కట్టడాలను ఉచితంగా సందర్శించేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. దీనికోసం తెలంగాణ దర్శిని అనే కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడానికి దోహదపడుతుందని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సంబంధిత అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సచివాలయం వేదికగా సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని పలు పునరాతన మెట్ల బావుల పునరుద్దరణకు చర్యలు చేపట్టింది. పురాతన కట్టడాలు కాపాడటమే లక్ష్యంగా సీఐఐతో రాష్ట్ర పర్యాటక శాఖ ఒప్పందం సైతం కుదుర్చుతుంది. ఈ సందర్బంగా పురాతన బావులు దత్తత తీసుకునేందుకు పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ రంగ సంస్తలు ముందుకు వచ్చాయి.