టెన్త్, ఇంటర్ ప్యాస్ అయినవారికి గుడ్ న్యూస్.. రైల్వే శాఖలో 3150 ఉద్యోగాలు..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్, దక్షిణ రైల్వే అప్రెంటిస్‌షిప్ కోసం నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్న వాళ్లు ఈ పోస్టుల కి అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాల లోకి వెళితే.. దీనిలో మొత్తం 3150 పోస్టులు వున్నాయి.

Indian-Railways
Indian-Railways

ఇక పోస్టుల వివరాలను చూస్తే.. గ్యారేజ్, వ్యాగన్ వర్క్‌ షాప్ పెరంబూర్, సెంట్రల్ వర్క్‌షాప్ పొన్మలై తిరుచ్చి లో ఖాళీలు వున్నాయి. అలానే S&T వర్క్‌ షాప్ పోదనూర్ యూనిట్ల లో కూడా పలు ఖాళీలు వున్నాయి. ఎంపిక అయిన వాళ్లు ఇక్కడ పని చెయ్యాలి.

ఇక అర్హత వివరాలను చూస్తే.. మొత్తం మూడు కేటగిరీలు వున్నాయి. 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఒక కేటగిరీ, రెండవ కేటగిరిలో పన్నెండు ప్యాస్ అయిన వాళ్లు, మూడవ దాంట్లో ఐటీఐ డిప్లొమా సర్టిఫికెట్ పొందిన వాళ్ళు ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్, టర్నర్ మొదలైనవి వున్నాయి. ఈ పోస్టుల కి అప్లై చేసుకోవాలంటే 31 అక్టోబర్ 2022 చివరి తేదీ. ఎలాంటి పరీక్ష, ఇంటర్వ్యూ ఉండదు.

సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూస్తే.. 10వ తరగతి, 12వ తరగతి, ఐటీఐ కోర్సులో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారట. అభ్యర్థులు sr.indianrailways.gov.in ని చూసి అప్లై చేసుకో వచ్చు. సాలరీ వివరాలను చూస్తే.. 10వ తరగతి ఉత్తీర్ణతకు రూ.6000, 12వ తరగతి వారికి, ITI వారికి 7000 రూపాయలు ఇస్తారు.

దరఖాస్తు రుసుము రూ.100. కానీ ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు ఈ దరఖాస్తు రుసుము ని పే చెయ్యక్కర్లేదు. అయితే ఏడాది నుంచి రెండేళ్ల వరకు శిక్షణ వ్యవధి. ఆ తరవాత ఆ వ్యక్తి కి ఉద్యోగాన్ని ఇస్తారు. ఇంకా డీటెయిల్స్ ని ఏమైనా పొందాలి అంటే అభ్యర్థులు sr.indianrailways.gov.in ని చూసి తెలుసుకోవచ్చు. వయస్సు కూడా చూసుకోండి. పోస్టులని బట్టి వయస్సు వుంది. వాటిని గమనించి అప్లై చేసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news