ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..నేడే వడ్డీ లేని రుణాలు విడుదల…

-

వైసీపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకూ ఎన్నో పథకాలను అమల్లోకి తీసుకొని వచ్చారు..రైతుల కోసం రైతు భరోసా, మహిళలకు, విద్యార్థులకు అమ్మఒడి, విద్యా కానుక , వృద్ధులకు పెన్షన్ పెంపు.. ఇలా ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టారు..వీటితో పాటుగా వైసిపి భరోసా పేరుతో ప్రజలకు రుణ సాయాన్ని అందిస్తున్నారు. ఇటీవల వాహన మిత్ర పథకంలో భాగంగా అర్హులకు కొత్త వాహనాలను అందించారు.నిన్న ఆటో డ్రైవర్ లకు 10 వేల సాయాన్ని అందించారు.

నేడు జగనన్న తోడు పథకం కింద వడ్డీ లేని రుణాల  నిధులను విడుదల చేయనుంది. ఈ పథకం ద్వారా చిరు వ్యాపారులకు రూ.10వేలు వడ్డీ లేని రుణాలను అందించనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారికి ఈ రుణాలను అందజేస్తున్నారు. ఈ క్రమంలో 3.95 లక్షల మందికి రూ.395 కోట్ల వడ్డీ లేని రుణాలను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం వివరించింది.

అంతే కాకుండా గత ఆరు నెలలకు సంబంధించిన రూ.15.96 కోట్ల వడ్డీ రీఇంబర్స్‌మెంట్‌నూ విడుదల చేయనున్నారు. సకాలంలో రుణాలు చెల్లించిన వారికి రూ.48.48 కోట్లు వడ్డీని చెల్లించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. చిరు వ్యాపారులకు అండగా నిలవడమే తమ లక్ష్యమన్న పాదయాత్ర సమయంలో వారి కష్టాలు చూశానని, వారికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 14 లక్షల మందికి ప్రభుత్వ పథకాలు అందేలా చేసినట్లు అధికారులు తెలిపారు.

జగనన్న తోడు పథం ద్వారా అందజేసే రుణాలకు పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. అర్హత కలిగిన ఒక్కొక్కరికి రూ.10వేలు రుణం అందిస్తున్నాం. వడ్డీ రీఎంబర్స్‌మెంట్‌ రూ.16.16 కోట్లు కలిపి, మొత్తం రూ.526.62 కోట్లు ప్రయోజనం కలుగుతుంది. అర్హులైనప్పటికీ రుణం రాకపోతే స్థానికంగా ఉండే గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news