ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెన్త్‌ అర్హతతో రూ.40 వేల జీతంతో ఉద్యోగాలు..

-

ఏపీ నిరుద్యోగులకు చక్కటి వార్త..ఏపీ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.మరో సారి ఉద్యోగాల  భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ప్రముఖ ఫ్లిప్ కార్ట్ సంస్థలో ఖాళీలను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ప్రకటన ద్వారా మొత్తం 71 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 3న ఉదయం 10 గంటలకు వైజాగ్ లో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.

ఇకపోతే ఈ జాబ్ మేళా ద్వారా మొత్తం 71 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. డెలివరీ అసోసియేట్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18-45 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు చెల్లించనున్నారు…

పూర్తి వివరాలు..

*. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు ఈరోజు హెచ్ఆర్, ఫైనల్ రౌండ్ నిర్వహించిన ఎంపిక చేస్తారు.

*. ఎంపికైన అభ్యర్థులు విశాఖపట్నం లో పని చేయాల్సి ఉంటుంది.

*. ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో Resume, ఆధార్, విద్యార్హతల సర్టిఫికేట్లు, బ్యాంక్ పాస్ బుక్ ను వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
*.అభ్యర్థులు ఇంగ్లిష్ లో ప్రింట్ చేయబడిన అడ్రస్ ను చదవగలగాలి.
*.ఇతర పూర్తి వివరాలకు 9014772885 నంబర్ ను సంప్రదించాలని సూచించారు.
*.ఎంపికైన అభ్యర్థులకు స్పాట్ లో ఆఫర్ లెటర్ ఇవ్వనున్నారు..
ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోగలరు..

Read more RELATED
Recommended to you

Latest news