జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..ఇలా దరఖాస్తు చేసుకోండి..

-

ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం జాతీయ స్థాయిలో జేఈఈని నిర్వహిస్తారు.. ఐఐటీల్లో ప్రవేశం పొందాలంటే జేఈఈ అడ్వాన్స్‌డ్ చాలా అవసరం..ఇప్పుడు జేఈఈ అడ్వాన్స్‌డ్- 2022 కోసం ఆగస్టు 1 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రారంభ దశలో విదేశీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి మాత్రమే అనుమతించారు.

ఇక భారతీయ విద్యార్థుల కోసం జేఈఈ మెయిన్ ఫలితాల తర్వాత అప్లికేషన్ కమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.. ఇది ఇలా ఉండగా,భారతీయ విద్యార్థుల కోసం జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు మొదటి దశ అయిన జేఈఈ మెయిన్‌కు విదేశీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు..

ఫారిన్ లో 12 చదివిన వాళ్ళు ఇప్పుడు మెయిన్స్ రాయాల్సిన అవసరం లేదు..ఇతర అర్హత ప్రమాణాలను  ఫుల్‌ఫిల్ చేస్తే నిబంధనల ప్రకారం.. జేఈఈ అడ్వాన్స్‌డ్-2022 కోసం నేరుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ఇతర అర్హతల్లో వయసు కూడా ఉంటుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్-2022కు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు 1997 అక్టోబర్ 1న లేదా ఆ తరువాత జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది. ఈ లెక్కన వీరు 1992 అక్టోబర్ 1న లేదా ఆ తర్వాత జన్మించి ఉండాలి. ఐఐటీల్లో దాదాపు 10 శాతం సీట్లు విదేశీయులకు కేటాయించారు. ఈ సీట్లు సంఖ్యాపరంగా సూపర్‌న్యూమరీగా ఉన్నాయి..ఇప్పుడు ఉన్న దానికన్నా ఎక్కువగానె ఉన్నాయి.

ఇందుకోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనప్పటికి, ఐఐటీలు విదేశాల్లో ఎలాంటి క్యాంపస్‌లను ఏర్పాటు చేయడం లేదు. దీంతో విదేశీ అభ్యర్థులు తమ సొంత ఖర్చుతో ఇండియన్ సెంటర్స్‌లో జేఈఈ అడ్వాన్స్‌డ్- 2022కు హాజరు కావాల్సి ఉంటుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్-2022 పరీక్ష ఆగస్టు 28న జరగనుంది. ఎగ్జామ్‌ను రెండు పేపర్లుగా నిర్వహించనున్నారు.

ఈ రెండూ తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. పేపర్-1, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు, పేపర్ 2 మధ్యాహ్నం 2:30 నుంచి ప్రారంభమవుతుంది. పరీక్ష తేదీ, సమయం భారతీయ, విదేశీ విద్యార్థులకు ఒకే విధంగా ఉంటాయి..జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను క్లియర్ చేసిన వారు ఐఐటీల్లో బీటెక్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్, బ్యాచిలర్-మాస్టర్ డ్యుయల్ డిగ్రీతో సహా అనేక కోర్సుల్లో జాయిన్ కావచ్చు. కొన్ని ఐఐటీల్లో నాలుగేళ్ల బ్యాచిలర్ ప్రోగ్రామ్‌లో చేరిన విద్యార్థులు మైనర్‌ కోర్సులతో బీటెక్ లేదా బీటెక్ చేయడానికి అవకాశం ఉంటుంది. డిగ్రీ చెయ్యడానికి కూడా అర్హత ఉంటుంది..

Read more RELATED
Recommended to you

Latest news