నిరుద్యోగులకు శుభవార్త.. మరో పది వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి తెలంగాణ సర్కర్ అనుమతి

-

నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో మరో 10,105 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగాల భర్తీ అంశాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. వివిధ శాఖల్లో మరో 10 వేల 105 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు ట్వీట్ చేశారు.

ఈ క్రమంలోనే కొందరు చేసే ఉద్యోగాల ప్రకటనలు జూమ్లా మాత్రమేనన్న హరీష్ రావు.. సీఎం కెసిఆర్ నేతృత్వంలో ఇప్పటికే 45 వేల 325 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. త్వరలోనే మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం భర్తీ చేయనున్న 10,105 ఉద్యోగాలలో గురుకులాల్లోనే మొత్తం 9,096 పోస్టులు ఉన్నాయి. మైనారిటీ గురుకుల విద్యాలయాల సంస్థలో 1,445 పోస్టులు. బీసీ గురుకుల లో 3,870. గిరిజన గురుకులాల్లో 1,514. ఎస్సీ గురుకులాల్లో 2,267 ఉద్యోగాల భర్తీకి సర్కారు అనుమతి ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news