ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం కొత్త బార్ పాలసీని ప్రకటిస్తూ జగన్ సర్కార్ మరో నిర్ణయం తీసుకుంది. కొత్త పాలసీ ప్రకారం బార్లకు లైసెన్స్ మూడు సంవత్సరాల పాటు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు జీవో 460 విడుదల చేసింది. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న బార్ లైసెన్స్‌లు మరో రెండు నెలలు పొడిగించినట్లే. కొత్త పాలసీ 2022 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమలు కానుంది.840 బార్‌లకు మించకుండా లైసెన్స్‌లు ఇవ్వాలని జీవోలో ఉంది.
50 వేలలోపు జనాభా ఉన్న ప్రాంతంలో రూ. 5 లక్షల డిపాజిట్, 50 వేల నుంచి 5 లక్షల జనాభా ఉన్న పట్టణాల్లో రూ.7 లక్షల 50 వేలు, 5 లక్షల పైన జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 10 లక్షలు అప్లికేషన్ ఫీజుగా నిర్ణయించారు. వేలం పద్దతిలో షాపుల కేటాయింపు ఉంటుంది. త్రీ స్టార్ హోటల్‌లో లైసెన్స్ ఫీజు రూ. 5 లక్షలు.