ఈ పథకంలో చేరిన వారికి గుడ్ న్యూస్… ఐదేళ్లలోనే బయటకి వచ్చేయచ్చు.. పైగా ఈ లాభాలు కూడా..!

-

పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ గుడ్ న్యూస్ చెబుతోంది. మీరు కూడా ఈ స్కీమ్ లో చేరారా..? అయితే మీరు తప్పక దీని గురించి తెలుసుకోవాలి. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ స్కీమ్ యొక్క లాకిన్ పీరియడ్‌ను తగ్గిస్తున్నట్టు తెలిపింది . PFRDA తీసుకున్న ఈ నిర్ణయం కేవలం కొంత మందికి మాత్రమే వర్తిస్తుంది. అందరికీ ఇది వర్తించదు.

ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. స్వయం ఉపాధి పొందుతున్న వారు, ఎంప్లాయర్- ఎంప్లాయీ రిలేషన్ లేనటువంటి వారు అంటే కొన్నేళ్ల వరకు కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేసే వారికి ఈ స్కీమ్ యొక్క లాక్ ఇన్ పీరియడ్ పదేళ్లుగా వుంది. అయితే ఇప్పుడు దీనిని సగం చేసేసారు. అంటే ఐదేళ్లే. కనుక ఇప్పుడు ఇలాంటి వారు ఎన్‌పీఎస్ నుంచి ఐదేళ్ల తర్వాత బయటకు వచ్చేయొచ్చు.

ఇక ఇది ఇలా ఉంటే కన్సల్టెన్సీ కింద పని చేసే వారు, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎన్‌పీఎస్ స్కీమ్‌లో చేరితే స్వచ్ఛంధంగానే ఐదేళ్లు దాటిన తర్వాత ఎన్‌పీఎస్ స్కీమ్ నుంచి వైదొలగవచ్చు. అయితే ఉద్యోగం చేసే వారికి ఇది వర్తించదు. కనుక ఉద్యోగులు ఇందులో చేరితే 60 ఏళ్లు వచ్చే వరకు ఇన్వెస్ట్ చెయ్యాలి.

18 ఏళ్లకు పైన వయసు కలిగిన వారు ఇందులో చేరచ్చు. ఈ స్కీమ్ లో ప్రతి ఆర్థిక సంవత్సరం రూ.1000 ఇన్వెస్ట్ చేసినా చాలు. లిమిట్ ఏం లేదు. ఎంతైనా ఇన్వెస్ట్ చేయచ్చు. పన్ను మినహాయింపు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. రూ. 2 లక్షల వరకు ట్యాక్స్ ఆదా చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news