సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ మంత్రివర్గం భేటీ ముగిసింది. ఐదు గంటలకు పైగా ఈ సమావేశం
కొనసాగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న పంటలతో పాటు వరదల వల్ల జరిగిన వరదల వల్ల జరిగిన జరిగిన నష్టాన్ని అంచనా వేస్తూ.. యుద్ధప్రాతిపదికన రోడ్లను పునరుద్ధరించడానికి చేపట్టే అంశాలపై భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది.
ఆగస్టు 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సభలో ప్రవేశపెట్టే పలు బిల్లుల గురించి కూడా కేబినెట్ చర్చించినట్లు సమాచారం. అంతేకాకుండా.. తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయనున్నది. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ మండలి కీలక నిర్ణయం తీసుకున్నది. త్వరలో జరిగే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనున్నది. అనంతరం ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు.