స్మార్ట్ యుగం నడుస్తుంది.. టెక్నాలజీ కూడా పెరిగిపోయింది.. ప్రతి ఒక్కరూ ఫోన్ లను వాడుతున్నారు.. అందులో వాట్సాప్ లేని ఫోన్ ఉండదు.. వాడని మనిషి ఉండడు.. కుటుంబ సభ్యులకు, ఫ్రెండ్స్ తో ఈజీగా చాట్ చేసుకోవచ్చు.. అయితే ఫోన్ లో స్టోరేజ్ సమస్య ఎక్కువగా ఉంటుంది.. దాంతో కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని కూడా డిలీట్ చెయ్యాల్సి వస్తుంది.. ప్రతి రోజూ వచ్చే మెసెజ్లతో స్టోరేజ్ త్వరగా ఫుల్ అయిపోతుంది. మరోవైపు వచ్చిన మెసేజ్లను డిలీట్ చేయడం కూడా కొన్ని సందర్భాల్లో కష్టం అవుతుంది.ఇక చేసేది లేక అలానే వాడతారు..
మొత్తం డిలీట్ చేద్దాం ఒకేసారి అంటే. అందులో కొన్ని ముఖ్యమైన సందేశాలు ఉంటే అవి కూడా డిలీట్ అయిపోతాయి. అందుకే చాలామంది మెసేజ్లు డిలీట్ చేయకుండా ఉంచుతారు..వాట్సాప్ యూజర్ ఏది ఉంచాలనుకున్నారో లేదో అనేది ముందే సెలెక్ట్ చేసుకోవాలి..iOS, Android వినియోగదారులకు ప్రక్రియ ఒకే విధంగా ఉంటుంది. మొదట సెట్టింగ్ అనే ఆప్షన్ ఎంచుకుని.. స్టోరేజీ అండ్ డేటా ఆప్షన్ క్లిక్ చేసి మేనేజ్ స్టోరేజ్ ను ఎంచుకోవాలి..లేదు అంటే పక్కన బాక్స్ లో పెట్టాలి..
ఆ తర్వాత డిలీట్ సింబల్ పై నొక్కితే మీరు ఎంచుకున్నవి ఒకేసారి డిలీట్ అయిపోతాయి. అలాగే 5 ఎంబి కంటే ఎక్కువ ఉన్న ఫైల్ లేదా ఇమేజ్, వీడియోలు ఎన్ని ఉన్నాయి. ఒకే ఐటమ్ ఎన్నిసార్లు ఫార్వార్డ్ చేశారో కూడా తెలుసుకునే వెసులుబాటు ఉంది. దాని కోసం సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్లి.. డేటా.. అలాగే స్టోరేజి క్లిక్ చేసి స్టోరేజ్ ఆప్షన్ ఎంచుకుంటే 5ఎంబి కంటే ఎక్కువ స్పేస్ ఉన్న లేదా ఫార్వార్డ్ చేయబడిన ఐటమ్స్ కనిపిస్తాయి. వీటిలో ఏది తీసెయ్యాలని అనుకుంటే వాటిని తీసి వెయ్యొచ్చు..ఇలా చెయ్యడం వల్ల స్టోరేజ్ అనేది వుంటుంది..