వ్యాపారాలు చేయాలనుకునే మహిళలకు గుడ్ న్యూస్.. రూ.3,00,000 వరకు లోన్..!

-

బిజినెస్ (business) చెయ్యాలని అనుకునే మహిళలకి గుడ్ న్యూస్. మహిళా ఆంట్రప్రెన్యూర్లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ‘ఉద్యోగిని’ పేరుతో లోన్స్ ఇస్తోంది. దీనితో మహిళలు ఈజీగా నచ్చిన వ్యాపారం చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

బిజినెస్/ business
బిజినెస్/ business

ఈ స్కీమ్ ద్వారా మహిళలు రూ.3,00,000 వరకు తక్కువ వడ్డీకే రుణాలు తీసుకొని వ్యాపారాలు స్టార్ట్ చెయ్యచ్చు. ఫైనాన్షియల్ సంస్థలతో కలిసి వుమెన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఈ రుణాలను అందిస్తోంది. ఉద్యోగిని స్కీమ్ ద్వారా మహిళలు రూ.3,00,000 వరకు వడ్డీ లేని రుణాలను పొందొచ్చు.

కేవలం రుణాలు ఇవ్వడమే కాదు… వ్యాపారులు నిర్వహించడం, ధరల్ని నిర్ణయించడం లాంటి అంశాల్లో శిక్షణ కూడా ఇస్తారు. ‘ఉద్యోగిని’ స్కీమ్ ద్వారా రుణాలు ఇస్తున్న ఆర్థిక సంస్థల్ని సంప్రదించి అప్లై చేయాలి. రీజనల్ రూరల్ బ్యాంక్స్, కమర్షియల్ బ్యాంక్స్, కో-ఆపరేటీవ్ బ్యాంకులు ఈ రుణాలను ఇస్తాయి.

నిరుపేద మహిళలు కూడా వ్యాపారాలు చేసేందుకు ఆర్థిక అవరోధాలు ఉండకూడదన్న లక్ష్యంతో ప్రారంభించిన స్కీమ్ ఇది. ఇది ఇలా ఉంటె ఈ స్కీమ్ ద్వారా ప్రభుత్వం 30 శాతం సబ్సిడీ కూడా ఇస్తుంది. మహిళలు ఎవరైనా ‘ఉద్యోగిని’ స్కీమ్ ద్వారా రుణాలకు దరఖాస్తు చేయొచ్చు.

25 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వయస్సు వారు ఈ రుణాలకు అప్లై చేయొచ్చు. వారి కుటుంబ వార్షికాదాయం రూ.1,50,000 లోపు ఉండాలి. అంత కన్నా ఎక్కువ వార్షికాదాయం ఉన్నవారికి ఈ లోన్ ఉండదు. అదే వితంతువు, వికలాంగ మహిళలకు వార్షికాదాయం లిమిట్ వర్తించదు.

అగర్‌బత్తీ తయారీ, బేకరీ, గాజుల తయారీ, బ్యూటీ పార్లర్, క్యాంటీన్, కేటరింగ్, క్లీనింగ్ పౌడర్, కాఫీ, టీ పౌడర్ తయారీ వంటి 88 రకాల వ్యాపారాలకు ఈ రుణాలు ఇవ్వడం జరుగుతుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news