ఎల్ఐసీ గుడ్‌న్యూస్..!

-

భవిష్యత్తు లో ఇబ్బందులు ఏమి లేకుండా ఉండాలని చాలా మంది ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకుంటారు. అందుకు ఎక్కువ మంది దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీలో పాలసీ ని తీసుకుంటూ వుంటారు. రిస్క్ తక్కువగా వుంటుందనే చాలా మంది పాలసీ తీసుకుంటారు.

ఇదిలా ఉంటే రెండు మూడు ప్రీమియాలు టైం కి కట్టేసి మరిచిపోయినా కూడా ఆ పాలసీలు ల్యాప్స్ అవుతుంటాయి. మీకు కూడా ఇలానే అయ్యిందా..? అయితే మీకు ఇది గుడ్ న్యూస్ ఏ. గడువు దాటి, మెచ్యూరిటీ పూర్తికాని పాలసీలను మళ్ళీ పునరుద్ధరించుకోవచ్చు. అయితే ఇది 2023, ఫిబ్రవరి 1 నుంచి మార్చి 24 వరకు కొనసాగుతుందని ఎల్ఐసీ ప్రకటించింది.

ప్రీమియం చెల్లింపులు నిలిచిపోయి ఐదేళ్లు లేదా దాని కంటే ఎక్కువ టైం ఉన్న పాలసీలను మాత్రమే తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు స్పష్టం చేసింది ఎల్ఐసీ. గడువు దాటితే ఆలస్య రుసుములోనూ రాయితీ కల్పిస్తున్నట్లు చెప్పారు. ఎన్ఏసీహెచ్, బిల్ పే రిజిస్టర్డ్ పాలసీలకు ప్రత్యేక ఆఫర్ ఆలస్యపు రుసుము రూ.5 వర్తిస్తుందని అన్నారు. వాట్సాప్ ద్వారానే మీరు పాలసీ ల్యాప్స్ అయ్యిందా లేదా అనేది తెలుసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా 89786 62090 నంబర్ కి అని మెసేజ్ చేయండి. మీకెప్పుడు 11 ఆప్షన్లు కనపడతాయి.

Read more RELATED
Recommended to you

Latest news