ఏపీ ఉద్యోగులు షాక్‌.. ఇంకా అందని జీతాలు !

-

ఏపీ ఉద్యోగులు షాక్‌ తగిలింది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఈనెల ఎదురుచూపులు తప్పడం లేదు. రాష్ట్రంలో సగం మందికి పైగా ఉద్యోగులు జనవరి నెల జీతం కోసం ఎదురుచూస్తున్నారు. అనేక మందికి ఇంకా పింఛను సొమ్ములు దక్కలేదు. ఫిబ్రవరి మూడో తారీకు దాటిపోయింది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిధుల మేరకు కేవలం కొంతమంది జీతాలు చెల్లించినట్లు సమాచారం. ఇంతవరకు రూ.1400 కోట్లు ఉద్యోగులకు జీతాల రూపంలో చెల్లించినట్లు విశ్వసనీయ వర్గాల కథనం. పెన్షనర్లకు రూ.1,100 కోట్ల చెల్లింపులు శుక్రవారం రాత్రి వరకు జరిగాయి.

కిందటి నెలలో ఉద్యోగులకు జీతాల రూపంలో రూ. 3,700 కోట్లు పెన్షనర్లకు రూ.2,000 కోట్లు చెల్లించారు. ఈ రకంగా చూస్తే ఇంకా ఎంత మొత్తంలో జీతాలు, పెన్షన్లు పెండింగ్ లో ఉన్నాయో అవగతం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కిందటి మంగళవారం రిజర్వు బ్యాంకు నుంచి రూ. 1,557 కోట్లు రుణం తీసుకుంది. ఆ మొత్తాలు ఈ నెలలోనే రాష్ట్ర ఖజానాకు చేరుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news