ఉద్యోగం కోసం చూస్తున్నారా…? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ రంగ సంస్థ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్, హైదరాబాద్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఇక పోస్టుల వివరాల లోకి వెళితే… మొత్తం పది ఖాళీలు వున్నాయి. ఏప్రిల్ 10లోగా అప్లై చేసుకోవచ్చు.
ఇక పోస్టుల వివరాల లోకి వెళితే… ప్రింటింగ్ టెక్నాలజీలో ఫస్ట్ క్లాసులో డిప్లొమో పాసై, బీటెక్/బీఈ/బీఎస్సీ(ఇంజనీరింగ్) ను గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఫస్ట్ క్లాస్ లో పూర్తి చేసిన వారు Supervisor (Printing) at S-1: Level పోస్టుకి అర్హులు. అదే Supervisor (Technical Control) at S-1: Level అయితే సంబంధిత విభాగంలో ఫస్ట్ క్లాసు మార్కుల తో డిప్లొమో/బీటెక్/బీఈ/బీఎస్సీ చేసిన వారు ఈ పోస్ట్ కోసం అప్లై చెయ్యచ్చు.
ఫస్ట్ క్లాసు మార్కులతో కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సబ్జెక్టుల్లో డిప్లొమా/బీటెక్/బీఈ/బీఎస్సీ చేస్తే Supervisor (IT) (RM) at A-1 Level కి అప్లై చెయ్యచ్చు. Supervisor (OL) (RM) at A-1 Level కి అయితే గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి హిందీ లేదా ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో మాస్టర్ డిగ్రీ చేసి, హిందీ నుంచి ఇంగ్లిష్, ఇంగ్లిష్ నుంచి హిందీకి అనువదించడంలో ఏడాది పాటు అనుభవం ఉంటే వారు అప్లై చెయ్యచ్చు.
Jr. Office Assistant (Hindi) at B-3 Level పోస్టుకి 55 శాతం మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేసి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే అర్హులు. అప్లికేషన్ లింక్: https://spphyderabad.spmcil.com/Interface/JobOpenings.aspx?menue=5