మీరు బంగారం కొనుగోలు చెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. బంగారం ధర గత వారం రోజుల్లో భారీగా పడిపోయింది. అదే విధంగా వెండి రేటు కూడా తగ్గింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..
అంతర్జాతీయ మార్కెట్ లో బలహీనమైన ట్రెండ్ కారణంగా దేశీ మార్కెట్‌లోనూ పసిడి రేట్లు తగ్గుతున్నాయి. ఇక రేట్లు ఎలా వున్నాయి అనేది చూస్తే… హైదరాబాద్ మార్కెట్ లో గత వారం రోజుల్లో బంగారం ధర తగ్గుతోంది.
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1630 దిగొచ్చింది. దీంతో పసిడి రేటు రూ.48,270 కి తగ్గింది. ఇది ఇలా ఉంటే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1500 తగ్గుదలతో రూ.44,250కు పతనమైంది.
ఇది ఇలా ఉంటే గత వారం రోజుల్లో వెండి ఏకంగా రూ.3300 పతనమైంది. దీంతో కేజీ వెండి ధర రూ.74,000కు దిగొచ్చింది. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు మొదలైన వాటి ప్రభావం బంగారం మీద పడుతుందన్న సంగతి తెలిసిందే.