ఏపీ ప్రజలకు ఊరట.. కర్ఫ్యూ వేళల్లో మార్పులు!

-

అమరావతి: ఏపీలో కర్ఫ్యూ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కర్ఫ్యూ వేళల్లో మార్పులు చేసింది. ఇప్పటివరకూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగింది. సోమవారం నుంచి కర్ఫ్యూ సమయంలో మార్పులు చేశారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ కర్ఫ్యూను సడలించారు. అయితే 5 గంటల వరకే దుకాణాలు పని చేస్తాయి. ఆ తర్వాత మూతపడతాయి. సాయంత్రం 5 తర్వాత అంటే ఒక గంట వరకూ ఇంటికి చేరుకునేందుకు సమయం ఇస్తారు.

అయితే తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కేసులు ఎక్కువగా ఉండటం వల్లే అక్కడ మాత్రం సర్ఫ్యూను సడలించలేదు. జిల్లా మొత్తం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ సడలింపు ఈ నెల 30 వరకూ అమల్లో ఉంటుంది. ఆ తర్వాత తదుపరి ఆదేశాలు వెల్లడిస్తారు. అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌను సడలిస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక తెలంగాణలోనూ లాక్ డౌన్‌ను పూర్తిగా ఎత్తివేశారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. కరోనా కాలానికి ముందు పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇక నుంచి అలానే కొనసాగనున్నాయి

Read more RELATED
Recommended to you

Latest news